Chandrababu : టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటలపాటు దీక్ష

టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టనున్నారు. రేపటి నుంచి చంద్రబాబు నిరసన దీక్ష చేయనున్నారు.

Chandrababu : టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటలపాటు దీక్ష

Chandrababu

Chandrababu Initiation for 36 hours : టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టనున్నారు. రేపటి నుంచి చంద్రబాబు నిరసన దీక్ష చేయనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ దీక్ష ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై.. అమిత్‌షాకు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. శుక్రవారం గవర్నర్‌ను టీడీపీ నేతలు కలవనున్నారు.

Nara Lokesh: టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఏ1గా నారా లోకేష్!

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి రామ్ ఇంటిపై దాడులు చేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అలాగే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదే విషయంపై చంద్రబాబు.. కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. వైసీపీ పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు చేస్తున్నట్లు చంద్రబాబు ఫోన్‌లో అమిత్ షాకు వివరించారు. అయితే దాడి విషయం ఇంకా తన దృష్టికి రాలేదని, పార్టీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు.

Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ!

ఈ క్రమంలోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తనున్నారు. శనివారం ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు.. హోంమంత్రి అమిత్ షా ని కలవనున్నారు. ఈ మేరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.