Kamalapuram: కమలాపురంలో వైసీపీదే హవా..

కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.

Kamalapuram: కమలాపురంలో వైసీపీదే హవా..

Kamalapuram

Updated On : November 17, 2021 / 5:14 PM IST

Kamalapuram: కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. లేటెస్ట్‌గా వచ్చిన ఫలితాల ప్రకారం.. 11, 14, 15వ వార్టుల్లో మూడు వార్డులనూ వైసీపీ కైవసం చేసుకుంది.

11వ వార్డులో వైసీపీ అభ్యర్థి సలీల 83 ఓట్లతో విజయం సాధించారు. 14వ వార్డులో వైసీపీ అభ్యర్ధి మోపూరి మేరి 87 ఓట్లతో విజయం సాధించారు. 15వ వార్డులో వైసీపీ అభ్యర్థి సంధ్యారాణి 128 ఓట్లతో విజయం సాధించారు.

9, 10, 16, 17, 20 17 వార్డుల ఫలితాలు కూడా వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి నాగమణి 27ఓట్లతో విజయం సాధించారు. 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి 42 ఓట్లతో గెలుపొందారు.

10 వార్డులో వైసీపీ అభ్యర్థి సుగంధి 81 ఓట్లతో విజయం సాధించారు. 16వ వార్డులో వైసీపీ అభ్యర్థి షాహీన బేగం 144 ఓట్లతో గెలుపొందారు. 20 వార్డులో వైసీపీ అభ్యర్థి నీలం ప్రమీల 135 ఓట్లతో విజయం సాధించారు.