CBI : వైఎస్ వివేకా హత్య కేసు..సీబీఐ విచారణ 68వ రోజు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ (CBI) విచారణ ఇంకా కొనసాగుతోంది. విచారణ జరిగి ఇప్పటికీ 68వ రోజుకు చేరుకుంది. కడప (Kadapa) జిల్లా కారాగారం, పులివెందుల ఆర్‌అండ్‌బీ (R&B) అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తున్నాయి.

CBI : వైఎస్ వివేకా హత్య కేసు..సీబీఐ విచారణ 68వ రోజు

Kadapa

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ (CBI) విచారణ ఇంకా కొనసాగుతోంది. విచారణ జరిగి ఇప్పటికీ 68వ రోజుకు చేరుకుంది. కడప (Kadapa) జిల్లా కారాగారం, పులివెందుల ఆర్‌అండ్‌బీ (R&B) అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తున్నాయి. 67వ రోజు విచారణలో భాగంగా.. కడపలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సుంకేసులకు చెందిన ఉమా శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ బంధువు భరత్‌ యాదవ్‌ను ప్రశ్నించి సమాచారం రాబట్టే యత్నం చేశారు.

Read More : TTD : తిరుమలలో గరుడ పంచమి, ఎందుకు నిర్వహిస్తారు ?

ఎర్రగంగిరెడ్డిని కీలక అనుమానితులుగా భావించి ఇప్పటికే పలుమార్లు సీబీఐ బృందం విచారించింది. పులివెందులలో సునీల్‌ యాదవ్‌తో పాటు.. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి, వివేకా పీఏ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గంగిరెడ్డి బంధువు వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ సురేంద్రనాథ్‌రెడ్డిని, చెప్పుల దుకాణం యజమాని మున్నాను మరోసారి ప్రశ్నించారు.

Read More :Girls Fight : బాబోయ్.. బాయ్‌ఫ్రెండ్ కోసం.. నడిరోడ్డుపై ఇద్దరమ్మాయిలు..

మరోవైపు సీజ్‌ ఆయుధాలను …వివేకా హత్యకు ఉపయోగించారా లేదా అనేదానిని నిగ్గుతేల్చే పనిలో పడింది దర్యాప్తు బృందం. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఆయుధాల నిర్ధారణ కోసం అనుమానితులను మరోమారు ప్రశ్నించింది సీబీఐ. మరి విచారణ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి.