Margani Bharat : 70శాతం ఆదాయం ఏపీ నుంచే..సినీ పరిశ్రమ రాష్ట్రానికి రావాలి-మార్గాని భరత్

70శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోంది. లైట్‌ బాయ్‌ నుంచి స్టార్‌ హీరో వరకు ప్రతి ఒక్కరూ ఏపీ నుంచి సంపాదిస్తున్నారు. టాలీవుడ్‌ పెద్దలు..

Margani Bharat : 70శాతం ఆదాయం ఏపీ నుంచే..సినీ పరిశ్రమ రాష్ట్రానికి రావాలి-మార్గాని భరత్

Margani Bharat

Margani Bharat : ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం కొనసాగుతోంది. సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. అటు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సినీ పరిశ్రమపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భారతి సిమెంట్‌ను రూ.100కే అమ్మండి అంటూ టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ట్వీట్‌ కూడా చేశారు. వీరి విమర్శలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఘాటుగానే బదులిస్తున్నారు.

తాజాగా ఈ అంశంపై వైసీపీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ హాట్ ట్వీట్ చేశారు. ”తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఉంది. ఏపీలో లేదు. కానీ 70శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోంది. లైట్‌ బాయ్‌ నుంచి స్టార్‌ హీరో వరకు ప్రతి ఒక్కరూ ఏపీ నుంచి సంపాదిస్తున్నారు. టాలీవుడ్‌ పెద్దలు ఏపీలో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెట్టేందుకు ముందుకు రావాలి” అని ట్వీట్‌ చేశారు.

Robo : రోబో సినిమా నిజం కానున్నదా?

సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ థియేటర్లను స్వచ్చందంగా మూసివేస్తున్నారు వాటి యజమానులు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్లు నడపలేమంటూ థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. పెద్ద థియేటర్లు సైతం మూత పడాల్సిన పరిస్థితి వచ్చింది.

టికెట్ ధరల తగ్గింపు చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని సినీ పరిశ్రమకు చెందిన వారు వాపోతున్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఇది పెద్ద నష్టం అంటున్నారు. గ్రామాల్లో, మండలాల్లో టికెట్ రేట్లు 50 రూపాయల లోపే ఉన్నాయని, లో క్లాస్‌ టికెట్లు కేవలం ఐదు రూపాయలే ఉన్నాయంటున్నారు.

Union Bank of India Jobs : యూనియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వివరాలు

దీనికితోడు థియేటర్లపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టింది. లైసెన్స్, పరిశుభ్రత, ఎమ్మార్పీ ధరలు, పార్కింగ్‌ ప్లేస్‌, మెయింటనెన్స్ నిబంధనలు ఉల్లంఘించారని, లోపాలు ఉన్నాయని, సౌకర్యాలు సరిగా లేవని కొన్ని థియేటర్లని అధికారులు సీజ్ చేశారు. ఓవైపు తగ్గిన రేట్లు, మరోవైపు అధికారుల తనిఖీలు… ఈ పరిస్థితుల్లో థియేటర్లు నడిపే పరిస్థితి లేదని యజమానులు వాపోతున్నారు. గిట్టుబాటు కాకపోవడంతో చాలా థియేటర్లు మూతపడ్డాయి.