Robo cinema to become true: మనిషి చేయిని పట్టుకుని విదిలించిన “మరమనిషి”: రోబో సినిమా నిజం కానున్నదా?

రోబో సినిమా, నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని, భవిష్యత్ లో రోబోలు మనుషులపై అప్రకటిత యుద్ధానికి సైతం దిగే అవకాశం లేకపోలేదని ఈ స్టోరీ చదివితే మీకే అర్ధం అవుతుంది.

Robo cinema to become true: మనిషి చేయిని పట్టుకుని విదిలించిన “మరమనిషి”: రోబో సినిమా నిజం కానున్నదా?

Robot Ameca

Robo cinema to become true: మీరు రజనీకాంత్ నటించిన రోబో సినిమా చూసే ఉంటారు కదా?. మరమనిషికి.. మనిషి లాంటి మేధస్సు, భావోద్వేగాలు ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పే స్టోరీనే ఆ సినిమా సారాంశం. అది సినిమానే అయినప్పటికీ, నిజజీవీతంలో కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు శంకర్ ఆ సినిమాను తనదైన ఊహాకోణంలో తెరకెక్కించాడు. ఇప్పుడు ఆ రోబో సినిమా, నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని, భవిష్యత్ లో రోబోలు మనుషులపై అప్రకటిత యుద్ధానికి సైతం దిగే అవకాశం లేకపోలేదని ఈ స్టోరీ చదివితే మీకే అర్ధం అవుతుంది. మనుషులు తయారు చేసిన రోబో ఇంకా అభివృద్ధి దశలో ఉండగానే మనిషిని నిలువరించిన ఘటన సంచలనంగా మారింది.

బ్రిటన్ కు చెందిన “ఇంజినీర్డ్ ఆర్ట్స్” అనే రోబో తయారీ సంస్థ ఎన్నో రోజులుగా ఒక రోబోను అభివృద్ధి చేస్తుంది. హ్యూమనాయిడ్ రోబో(మానవరూప రోబో)గా పిలిచే ఈ రోబోకు “అమెకా”గా నామకరణం చేసింది సంస్థ. అచ్చు మనిషిలా ప్రవర్తించే రోబోను అభివృద్ధి చేస్తున్నామంటూ ఇంజనీర్డ్ ఆర్ట్స్ సంస్థ గతంలోనే ప్రకటించింది. అందులో బాగంగానే, ఈ “అమెకా”ను అభివృద్ధి చేసింది. ఈ రోబోకు మనుషుల మాదిరే ఉండేలా మేధస్సును, భావోద్వేగాలు పలికేలా కోడ్ ప్రోగ్రామ్ చేసారు. దీంతో అచ్చం మనుషుల మాదిరి హావభావాలను వ్యక్త పరచడం ప్రారంభించింది ఈరొబో. ఇటీవల “అమెకా” రోబోకు చేతులు, ముఖం, కళ్ళు, కాళ్ళు అమర్చి ప్రోగ్రాంను పరీక్షించి చూశారు. ప్రోగ్రాం రన్ అవుతుండగానే రోబో లేచి నిలబడి, తన చేతులను, ముఖకవళికలను దానంతట అదే పరీక్షించికుంది. ఆ పరీక్ష విజయవంతం కావడంతో “అమెకా” ప్రోగ్రాంను మరింత అభివృద్ధి చేసి తిరిగి పరీక్షించారు ఇంజినీర్లు.

Also Read: New Smartphone from VIVO: రంగులు మారే బ్యాక్ ప్యానెల్ తో వస్తున్న వివో “V23”

డిసెంబర్ 22న జరిపిన ఈ ట్రయల్ రన్ లో.. “అమెకా” ఎదురుగా నిలబడిన ఓ వ్యక్తి.. తన చేతిని రోబో ముఖానికి దగ్గరగా తీసుకెళ్లాడు. అతని చేతిని గమనించిన రోబో “అమెకా”, మనిషి చేతిని పట్టుకుని పక్కకు విదిలించింది. దీంతో ఆశ్చర్యానికి గురైన ఇంజినీర్లు వెంటనే ప్రోగ్రాంను నిలిపివేశారు. మన వ్యక్తిగత పరిసరాల్లో ఇతరులు ప్రవేశిస్తే మానవ మెదడు ఎలా స్పందిస్తుందో, “అమెకా” మెదడు కూడా అలానే స్పందించింది. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన “ఇంజీనీర్డ్ ఆర్ట్స్” సంస్థ తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు, రోబోలు మనుషుల శ్రామిక శక్తిని తగ్గించి, సహాయం చేసే విధంగా ఉండాలి కానీ, ఇలా మనుషులపైనే తిరగబడే విధంగా ఉండకూడదంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇక వీడియో చూసిన మన భారతీయులు, రజనీకాంత్ రోబో సినిమా త్వరలో నిజం కానునందని అంటున్నారు. మరి రోబో “అమెకా” చేసిన ఆ విన్యాసం ఏమిటో మీరు చూడండి.

Also Read: Indian Army: అత్యాధునిక భద్రతతో కూడిన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసిన ఇండియన్ ఆర్మీ