Bathukamma 2022: తెలంగాణ ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ.. రూ.339.73 కోట్ల ఖర్చు

తెలంగాణ ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం చీరలు పంచుతున్న విషయం తెలిసిందే. పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను సారెలుగా అందిస్తుంది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతాయి. తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాదిలాగే బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కూడా భారీగా ఖర్చు చేస్తోంది. మొత్తం 339.73 కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ సర్కారు ఇప్పటికే తెలిపింది.

Bathukamma 2022: తెలంగాణ ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ.. రూ.339.73 కోట్ల ఖర్చు

Bathukamma 2022

Bathukamma 2022: తెలంగాణ ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం చీరలు పంచుతున్న విషయం తెలిసిందే. పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను సారెలుగా అందిస్తుంది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతాయి. తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాదిలాగే బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కూడా భారీగా ఖర్చు చేస్తోంది.

మొత్తం 339.73 కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ సర్కారు ఇప్పటికే తెలిపింది. ఇప్పటికే కోటి చీరలను సిద్ధం చేసింది. వాటిని జిల్లాలకు తరలించింది. 10 రకాల రంగుల్లో ఆయా చీరలు ఉన్నాయి. మొత్తం 24 విభిన్న డిజైన్లతో, 240 రకాల త్రేడ్ బోర్డర్‌లతో రూపొందించారు. రేపు పలు జిల్లాల్లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు బతుకమ్మ చీరల పంపీణీ చేస్తారు.

ఈ సందర్భంగా ఇవాళ కేటీఆర్ స్పందిస్తూ… ‘‘తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బతుకమ్మ చీరల పంపిణీ రేపటి నుంచి ప్రారంభించనున్నాం. తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించాం’’ అని చెప్పారు. ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి మహిళకు చీరను అందిస్తారు.

NTR Health University row: పేర్లు మార్చాలని అనుకుంటే ఈ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా?: పవన్ కల్యాణ్