ఢిల్లీలో కరోనా కల్లోలం.. పెళ్లిళ్లు, మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు!

  • Published By: sreehari ,Published On : November 18, 2020 / 09:28 AM IST
ఢిల్లీలో కరోనా కల్లోలం.. పెళ్లిళ్లు, మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు!

Covid-19 Delhi weddings markets : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడమే కాదు. కరోనా మరణాల సంఖ్య 100కు చేరింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ఆంక్షలు విధించాలని నిర్ణయించారు.



కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మళ్లీ పాత ఆంక్షలను అమలు చేయాలని భావిస్తోంది.

ఈ మేరకు ఆంక్షల అమలు నిర్ణయాలపై ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ (LG) అనిల్ బైజాల్ ను కోరింది. కేంద్రం మార్గదర్శకాల్లో వివాహాది కార్యక్రమాల్లో 200 మంది వరకు పాల్గొనవచ్చు. అయితే పెళ్లిళ్లు, మార్కెట్లే కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి.



ఈ రెండింటిలోనే ఎక్కువగా జనసమూహాల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పరిస్థితుల దృష్ట్యా గతంలో అమలు చేసిన 50 మంది వరకు పరిమితిని మళ్లీ విధించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.



https://10tv.in/low-cost-covid-19-test-kit-prices/
మార్కెట్లలో రద్దీని నివారించేలా చర్యలు చేపట్టింది. దివాళీ పండుగ సమయంలో మార్కెట్లకు వెళ్లేవారిలో చాలామంది ముఖాలకు మాస్క్ లేకుండానే తిరుగుతున్నారు. భౌతిక దూరాన్ని పాటించడంలేదు. దీని కారణంగా మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది.



కోవిడ్ నిబంధనలు పాటించని మార్కెట్లను మూసివేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అనుమతిని ఇవ్వాలని కేంద్రాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. కరోనాకు సంబంధించి అన్నింటిని కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తోంది.