2023 Komaki SE Scooter : దిమ్మతిరిగే అప్‌గ్రేడ్ ఫీచర్లతో 2023 కొమాకి SE ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

2023 Komaki SE Scooter : కొమాకి SE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరింత టెక్నాలజీ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. 2023 (Komaki SE) ధర రూ. 96,968 (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ కానుంది. ఇప్పుడు LiFePO4 (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీని ఉపయోగిస్తుంది.

2023 Komaki SE Scooter : దిమ్మతిరిగే అప్‌గ్రేడ్ ఫీచర్లతో 2023 కొమాకి SE ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

2023 Komaki SE electric scooter range launched

2023 Komaki SE Scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) స్టార్టప్ కంపెనీ కొమాకి (Komaki SE) రేంజ్ ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ అనే 3 వేరియంట్‌లను కలిగి ఉంది. ఈ కొత్త అవతార్‌లో Komaki SE ఎకో కోసం 75-90km, Komaki SE స్పోర్ట్ కోసం 110-140km, Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ కోసం 150-180km పరిధిగా అందిస్తుంది. 2023 Komaki SE ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింద విధంగా ఉన్నాయి.

Komaki SE Eco : రూ. 96,968
Komaki SE స్పోర్ట్ : రూ. 1,29,938
Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ : రూ. 1,38,427

Read Also : Ola Electric GigaFactory : ఓలా ఎలక్ట్రిక్ భారతీయ అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలైందోచ్.. దేశంలో ఎక్కడ? కార్యకలాపాలు ఎప్పుడంటే?

కొమాకి Komaki SE ఎకో స్పీడ్ లిమిట్ 55-60km అయితే, Komaki SE స్పోర్ట్, Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ 75-80km వేగాన్ని అందిస్తుంది.ఎలక్ట్రిక్ స్కూటర్ LiFePO4 బ్యాటరీతో 3kW హబ్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో ఎకో, స్పోర్ట్ టర్బో అనే 3 రైడ్ మోడ్‌లు ఉన్నాయి. అందులో SE 20-లీటర్ బూట్‌ను కలిగి ఉంది. 2023 కొమాకి SE పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది.

2023 Komaki SE electric scooter range launched

2023 Komaki SE electric scooter range launched

LED ఫ్రంట్ వింకర్‌లు, LED DRLలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ ఆపరేషన్, యాంటీ-స్కిడ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం TFT స్క్రీన్ ఆన్‌బోర్డ్ విగేషన్, సౌండ్ సిస్టమ్, కాలింగ్ ఆప్షన్‌లను అందిస్తుంది. కొమాకి SE ఇప్పటికే కొనుగోలుదారులకు ఇష్టమైన ఆప్షన్లలో ఒకటిగా ఉంది. ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో స్టైల్‌తో క్లీన్ అండ్ సేఫ్ రైడ్ సెర్చ్ చేస్తున్న రైడర్‌లకు ఇది కచ్చితంగా సరైన ఆప్షన్ అందిస్తుందని డైరెక్టర్, గుంజన్ మల్హోత్రా అన్నారు.

Read Also : Nothing Phone 2 Price : జూలై 11న నథింగ్ ఫోన్ (2) వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్..!