Top 10 Cars in September : 2023 సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. ఏ బ్రాండ్ కార్లు ఎన్ని ఉన్నాయంటే?

Top 10 Cars in September : 2023 సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఏయే బ్రాండ్ కార్ల మోడల్స్ ఎన్ని ఉన్నాయంటే?

Top 10 Cars in September : 2023 సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. ఏ బ్రాండ్ కార్లు ఎన్ని ఉన్నాయంటే?

6 Maruti, 2 Tata, 2 Hyundai cars among top 10 Models in September 2023 in Telugu

Updated On : October 4, 2023 / 10:34 PM IST

Top 10 Cars in September 2023 : స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (SUVs), సెమీకండక్టర్లు మెరుగైన లభ్యతతో పాటు అధిక ఉత్పత్తి డిమాండ్ కారణంగా ప్యాసింజర్ వెహికల్ (PV) సెగ్మెంట్ ఈ ఏడాది 2023లో రికార్డ్ వాల్యూమ్‌లను సాధించింది. గత సెప్టెంబర్‌లో 363,733 యూనిట్లు, కార్ల వాల్యూమ్‌లు భారత మార్కెట్లో ఒక నెలలో అత్యధికంగా నమోదయ్యాయి.

Read Also : Best Smartphones in India : కొత్త ఫోన్ కావాలా? రూ.25వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!

సెప్టెంబరులో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లలో మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి మొత్తం 6 మోడళ్లను కలిగి ఉండగా, టాటా మోటార్స్ (Tata Motors), హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Model Cars)లు ఒక్కొక్కటి 2 ఉన్నాయి. బాలెనో (Baleno Car), వ్యాగన్ఆర్ (WagonR Sales), నెక్సాన్ (Nexon Car Sale) ఒక్కొక్కటిగా ఉన్నాయి.

అగ్రస్థానంలో బాలెనో.. ఆ తర్వాతి స్థానాల్లో :

గత సెప్టెంబరులో 18,416 యూనిట్ల అమ్మకాలతో మరోసారి నంబర్ వన్ స్థానంలో ఉన్న మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) అగ్రస్థానంలో ఉండటం కొత్తేమీ కాదు. ఈ మోడల్ కారు తర్వాత ప్రముఖ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 16,250 యూనిట్ల వద్ద నిలిచింది.

6 Maruti, 2 Tata, 2 Hyundai cars among top 10 Models in September 2023 in Telugu

Top 10 Cars in September 2023 : 6 Maruti, 2 Tata, 2 Hyundai cars

2 మారుతీ కార్ల వెనుక టాటా నెక్సాన్ 15,325 యూనిట్ల అమ్మకాలను కలిగి ఉంది. బ్రెజ్జా, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా మధ్య స్లాట్‌లను కలిగి ఉన్నాయి. మధ్య స్లాట్‌లను 4 మారుతీ కార్లు ఆక్రమించాయి. టాటా నెక్సాన్ తర్వాత ప్రధాన పోటీదారు మారుతి సుజుకి బ్రెజ్జా సెప్టెంబర్‌లో 15,001 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

గత నెలలో కార్ల అమ్మకాల టాప్ జాబితా :

ఆ తర్వాత మారుతీ సుజుకి స్విఫ్ట్ 14,703 యూనిట్లతో, మారుతి సుజుకి డిజైర్ 13,880 యూనిట్లతో, మారుతి సుజుకి ఎర్టిగా 13,528 యూనిట్లతో అమ్మకాలు జరపగా.. పంచ్, క్రెటా, వెన్యూ కూడా ఈ జాబితాలో నిలిచాయి. టాటా పంచ్ సెప్టెంబరులో 13,045 యూనిట్ల అమ్మకాలను ఆకట్టుకునేలా కొనసాగించింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ లీడర్, హ్యుందాయ్ క్రెటా, 12,717 యూనిట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. సెప్టెంబర్‌లో 12,204 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్ వెన్యూ అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలో చోటు సంపాదించింది.

Read Also : Nothing Phone 2 Sale Price : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. నథింగ్ ఫోన్ (2)పై భారీ డిస్కౌంట్.. తక్కువ ధరకే కొనేసుకోండి!