Xiaomi Mi 12 Pro : రిలీజ్‌కు ముందే 2 లక్షల బుకింగ్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

తి త్వరలో షావోమీ 12 సిరీస్ విడుదల కానుంది. Xiaomi 12, Xiaomi 12 Pro ఫోన్లు డిసెంబర్ 28న చైనాలో విడుదల కానున్నాయి. ఈ ఫోన్ల లాంచింగ్ ముందే ప్రీ ఆర్డర్లకు అవకాశం కల్పించింది.

Xiaomi Mi 12 Pro : రిలీజ్‌కు ముందే 2 లక్షల బుకింగ్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Ahead Of Its Launch, Xiaomi Mi 12 Pro Is Already Quite Popular As Pre Orders Pile In

Xiaomi Mi 12 Pro : ప్రపంచ గ్లోబల్ మొబైల్ మార్కెట్లో అత్యాధునిక ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. ఆపిల్ నుంచి ఐఫోన్లు, ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు ఆకర్షణీయమైన ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు అదే  కేటగిరీలో ఆపిల్ తర్వాత చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ సెకండ్ ప్లేసులో ఉంది. షావోమీ నుంచి ఎంఐ (Mi) , రెడ్‌మీ స్మార్ట్ ఫోన్లు అత్యాధునిక ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. అతి త్వరలో షావోమీ 12 సిరీస్ విడుదల కానుంది. Xiaomi 12, Xiaomi 12 Pro ఫోన్లు డిసెంబర్ 28న చైనాలో విడుదల కానున్నాయి. ఈ ఫోన్ల లాంచింగ్ ముందే ప్రీ ఆర్డర్లకు అవకాశం కల్పించింది.

ఇప్పటికే 2లక్షలకు పైగా ప్రీ ఆర్డర్లు వచ్చినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ ప్రీఆర్డర్లు అనేక ఈ కామర్స్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయట.. ప్రామాణికంగా Xiaomi 12 TMall, JD.comలో 18,000 నుంచి 80,000 రిజర్వేషన్‌లతో మొత్తంగా 98,000 రిజర్వేషన్‌లు వచ్చాయి. మరోవైపు, Xiaomi 12 Pro TMall, JD.comలో వరుసగా 21,000 నుంచి 92,000 రిజర్వేషన్‌లతో 110,000 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్‌లు వచ్చినట్టు నివేదిక వెల్లడించింది. Xiaomi 12 Pro టీజ్ వీడియో రిలీజ్ కాగా.. స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2K డిస్‌ప్లేను కలిగి ఉందని పేర్కొంది.

E5 AMOLED ప్యానెల్, సాధారణ OLED డిస్‌ప్లేల కంటే తక్కువ శక్తిని అందిస్తుంది. ఈ డివైజ్‌లో రిఫ్రెష్ రేట్ వేరియబుల్ 1Hz వరకు తగ్గనుంది. Xiaomi 12 Pro స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో వస్తోంది. గరిష్టంగా 12GB RAM, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో రానుంది. MIUI 13తో Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. Xiaomi మరో టీజర్‌లో ఎక్కువ సమయం గేమింగ్ సెషన్‌లలో 12Pro ఫోన్ డివైజ్ హీటింగ్‌ను కంట్రోల్ చేయగలదని వెల్లడించింది. Xiaomi 12 Pro కింగ్ ఆఫ్ గ్లోరీ (అకా హానర్ ఆఫ్ కింగ్స్) గేమ్ ఆడేటప్పుడు టెంపరేచర్ 43.5 డిగ్రీల సెల్సియస్‌లో నియంత్రించినట్టు తెలిపింది.

గరిష్ట ఫ్రేమ్ రేటుతో 30 నిమిషాల గేమ్‌ప్లే అందించింది. టిప్‌స్టర్ (Evan Blass) Xiaomi 12 డిజైన్‌ను రివీల్ చేసింది. గత మోడల్ కంటే భిన్నమైన డిజైన్‌లో రానుంది. వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరాలు, LED ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్‌లో సెంట్రల్ పంచ్-హోల్ డిస్‌ప్లే అందిస్తోంది. Xiaomi 12 50-MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానున్నట్టు అంచనా. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4500mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుందని భావిస్తున్నారు.

Read Also : Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!