Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్ ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల అందరికి అందుబాటులో తీసుకొచ్చింది.

Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!

How To Use Whatsapp View Once On Android, Ios Step By Step Guide

Whatsapp View Once : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్ ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను వాట్సాప్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల అందరికి అందుబాటులో తీసుకొచ్చింది. మీరు పంపిన ఫొటోలు లేదా వీడియోలను అవతలి వ్యక్తి ఒకసారి మాత్రమే చూసేలా (View Once feature) ఫీచర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సింగిల్ వ్యూతో వెంటనే ఫొటో లేదా వీడియో Disappear అయిపోతుంది. మీరు షేర్ చేసిన మెసేజ్ చాట్ బాక్సులో ఎప్పటికీ కనిపించకుండా ఉండాలంటే ఈ ఫీచర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫొటో లేదా వీడియో పంపే ముందు ఒక ప్రాంప్ట్ మెసేజ్ (Send Photos And Videos that Can Only be Viewed Once) కనిపిస్తుంది.

మీరు OK బటన్ పై క్లిక్ చేస్తే చాలు.. మీరు పంపిన ఫొటో లేదా వీడియో అవతలి యూజర్ గ్యాలరీలో (Gallery) సేవ్ కాదు.. చూసిన వెంటనే అది అదృశ్యమైపోతుంది. మెసేజ్ పంపడానికి ముందే ఈ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ఫీచర్ Enable చేసిన తర్వాత Forward, Save, Star, Share చేయడం కుదరదని గుర్తించుకోవాలి. ఒకవేళ మీరు పంపిన ఫొటో లేదా వీడియోను అవతలి వాట్సాప్ యూజర్ 14 రోజుల లోపు ఓపెన్ చేయకుండా ఉంటే దానంతట అదే ఎక్స్ పెయిర్ అయిపోతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) డివైజ్‌ల్లో వాట్సాప్ View Once ఫీచర్ ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కింది విధంగా సెట్ చేసుకోండి.

1. Whatsapp లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోండి.
2. మీరు పంపే ఫొటో లేదా వీడియోను ఎంచుకోండి..
3. మీ కాంటాక్టుల్లో ఎవరికి ఒకసారి మాత్రమే మెసేజ్ కనిపించాలో ఎంచుకోండి.
4. Caption bar పక్కనే మీకు View Once ఐకాన్ ఒకటి కనిపిస్తుంది.
5. మీకు ఒక అలర్ట్ మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.
6. View Once ఫీచర్ యాక్టివేట్ చేయాలా? అని ప్రాంఫ్ట్ మెసేజ్ కనిపిస్తుంది.
7. అప్పుడు OK బటన్ నొక్కితే చాలు.. ఎంచుకున్న కాంటాక్టుకు ఫొటో లేదా వీడియో SEND అవుతుంది.

వాట్సాప్ యూజర్లకు మెసేజింగ్ కంపెనీ ప్రైవసీ విషయంలో దీన్ని గుర్తు చేస్తోంది. మీరు పంపే ఫొటోలు లేదా వీడియోలను కేవలం (trusted individuals)కు మాత్రమే పంపాలని సూచిస్తోంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసినప్పటికీ కూడా యూజర్లు పంపిన ఫొటోలు లేదా వీడియోలను అవతలి యూజర్ మెసేజ్ అదృశ్యమయ్యేలోపే ScreenShot లేదా Screen Recording చేసుకోవచ్చు. ఆ యూజర్ మీ మెసేజ్ స్ర్కీన్ షాట్ లేదా స్ర్కీన్ రికార్డింగ్ చేసిన విషయం తెలుసుకోలేరు. మెసేజ్ Disappear కావడానికి ముందే కెమెరా లేదా ఇతర డివైజ్ ద్వారా రికార్డు చేసుకునే వీలుంది. View Once ఎనేబుల్ చేసిన తర్వాత ఆ ఫొటో చాట్ బాక్సులో డిలీట్ అయినప్పటికీ WhatsApp’s servers సర్వర్లలో కొన్ని వారాల పాటు అలానే ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ మెసేజ్‌ను అందుకున్న వాట్సాప్ యూజర్ మీడియా ద్వారా రిపోర్టు చేయొచ్చు.

Read Also : Omicron detection Kit : ఒమిక్రాన్ గుర్తించే సరికొత్త కిట్..