Summer Effect : ఎయిర్ కూలర్..ఎయిర్ కండీషన్ ఏది బెస్ట్

ఎయిర్ కూలర్..ఎయిర్ కండీషన్ ఏది బెస్ట్ అంటే ఏం చెబుతారు ? ఠక్కున ఏసీ బెస్ట్ అంటున్నారు హైదరాబాద్ నగర వాసులు.

  • Published By: madhu ,Published On : March 25, 2019 / 03:02 AM IST
Summer Effect  : ఎయిర్ కూలర్..ఎయిర్ కండీషన్ ఏది బెస్ట్

ఎయిర్ కూలర్..ఎయిర్ కండీషన్ ఏది బెస్ట్ అంటే ఏం చెబుతారు ? ఠక్కున ఏసీ బెస్ట్ అంటున్నారు హైదరాబాద్ నగర వాసులు.

ఎయిర్ కూలర్..ఎయిర్ కండీషన్ ఏది బెస్ట్ అంటే ఏం చెబుతారు ? ఠక్కున ఏసీ బెస్ట్ అంటున్నారు హైదరాబాద్ నగర వాసులు. దాదాపు 19 శాతం మంది ఏసీలు కొనుగోలు చేస్తున్నారంట. 5 మంది మాత్రం అద్దెకు తీసుకొంటున్నారంట. ఇదంతా ఓ సర్వేలో తేలింది. ఎండకాలంలో కూలర్స్‌కి బదులు ఏసీవైపు నగర ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఏసీల వినియోగం..ఇతరత్రా అంశాలపై స్టడీ చేసేందుకు ‘ఆన్ డిమాండ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ అర్బన్ క్లాస్’ అనే సంస్థ అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి ఆసక్తికర అంశాలను వెల్లడించింది. దాదాపు 84 శాతం మంది తాము ప్రతి ఎండాకాలంలో ఒక్కమారైనా ఏసీ మరమ్మతు సేవలను వినియోగించుకుంటున్నట్లు తేలింది. 
Read Also : నోరు అదుపులో: ఎన్నికల ప్రచారంలో ఈ పదాలు వాడొద్దు

వేసవికాలం వచ్చిందంటే..చాలు..కూలర్లకు..ఏసీలకు భలే గిరాకి పెరుగుతుంటుంది. ప్రస్తుతం ఎండలను ఎదుర్కొనేందుకు నగర వాసులు ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఏసీలను అధికంగా వినియోగిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. పేరొందిన బ్రాండ్లన్నీ తొలి ఆవిష్కరణ ఇక్కడే చేయడం ఎక్కువైంది. నగరంలో ఏసీల వినియోగం పెరిగిపోయిందని ‘ఆన్ డిమాండ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ అర్బన్ క్లాస్’ సంస్థ అధ్యయనంలో తేలింది.

సాధారణంగా వేసవిలో చెల్లించే కరెంటు బిల్లులతో పోలిస్తే చాలా ఎక్కువగానే చెల్లించమంటున్నారు జనం. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది ఒక ఏసీ ఉందని చెప్పారు. రెండు ఏసీలున్న వారు 25శాతం మంది కాగా..మూడు కన్నా ఎక్కువగా ఏసీలు వాడుతున్న వారు 14 శాతం ఉన్నారు. ఇక అద్దెకు ఏసీలు తీసుకునే వారి 10 శాతంగా ఉంది. మొత్తంగా 40 శాతం ఇళ్లల్లో కనీసం ఒక్క ఏసీ కామన్‌గా మారిపోయింది. 

ఏడు గంటలకు పైగా ఏసీలు వాడడం వల్ల రిపేర్‌ చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. 82 శాతం మంది వేసవికంటే ముందుగానే రిపేర్లు చేయించుకుంటున్నారంట. నాణ్యమైన ఏసీ సర్వీసింగ్‌కు రూ. 1000 వరకు డిమాండ్ చేస్తున్నా..ఒకే అనేస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం మార్కెట్‌లో ఏసీలకు భలే డిమాండ్ ఉంటోంది. పలు కంపెనీలకు ఈఎమ్ఐ కింద అందిస్తుండడంతో పలువురు ఏసీలవైపు మొగ్గు చూపుతున్నారు. 5 స్టార్ ఇన్వర్టర్‌ ఏసీలకు నగరంలో డిమాండ్ అధికంగా ఉంది. కరెంటు వినియోగం తక్కువగా ఉండాలి..ఎక్కువ చల్లదనం అందాలని అనుకునే వారు నగరంలో ఎక్కువే. 
Read Also : ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?