Airtel Prepaid Plans : జియోకు పోటీగా.. ఎయిర్‌టెల్ నుంచి 2 చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..!

Airtel Prepaid Plans : రిలయన్స్ జియోకు పోటీగా భారతీ ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లతో ముందుకొచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ చీపెస్ట్ రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Airtel Prepaid Plans : జియోకు పోటీగా.. ఎయిర్‌టెల్ నుంచి 2 చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..!

Airtel Launches 2 New Cheaper Prepaid Plans With Exact 30 Days Validity

Airtel Prepaid Plans : రిలయన్స్ జియోకు పోటీగా భారతీ ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లతో ముందుకొచ్చింది. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ చీపెస్ట్ రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఎయిర్ టెల్ రూ.296, రూ.319 విలువైన రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను 30రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇటీవలే టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కూడా ‘ట్రూ’ 30 రోజుల వ్యాలిడిటీతో రూ. 259 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నెలవారీ ప్లాన్‌లు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. TRAI ఆర్డర్ ప్రకారం.. టెలికాం ఆపరేటర్లు కనీసం ఒక ప్లాన్‌ను 30 రోజుల వ్యాలిడిటీతో నెలవారీ రెన్యువల్ ప్లాన్‌ను అందించాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్ రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 25GB 4G హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అలాగే కస్టమర్లు 1 MBకి 50 పైసలు ఛార్జ్ చేస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్ ద్వారా రోజుకు 100 SMSలను అందిస్తుంది. రోజువారీ 100 SMS లిమిట్ ముగిసిన తర్వాత.. కస్టమర్లు లోకల్ SMSలకు రూ.1 ప్రతి STD SMSకి రూ. 1.5 వసూలు చేస్తారు. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోల మొబైల్ ఎడిషన్ 30-రోజుల ఫ్రీ ట్రయల్, 3-నెలల అపోలో 24/7 సర్కిల్, షా అకాడమీ క్లాస్‌తో అప్‌స్కిల్స్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్ హలో ట్యూన్స్‌లను అందిస్తోంది.

Airtel Launches 2 New Cheaper Prepaid Plans With Exact 30 Days Validity (1)

Airtel Launches 2 New Cheaper Prepaid Plans With Exact 30 Days Validity 

ఎయిర్‌టెల్ రూ. 310 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ అందించే రెండవ ప్లాన్ రూ. 310 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 30 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. రోజుకు 2GB రోజువారీ డేటాను పొందవచ్చు. కస్టమర్లు సాధారణంగా నెలకు 56GB నుంచి 62GB డేటాను పొందవచ్చు. రోజువారీ డేటా కోటా పూర్తి అయిన తర్వాత.. ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి తగ్గిపోతుంది. యూజర్లు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు రోజుకు 100 SMSలను పొందవచ్చు. రూ. 296 ప్లాన్ మాదిరిగానే.. రూ. 310 ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోల మొబైల్ ఎడిషన్ 30-రోజుల ఫ్రీ ట్రయల్, 3 నెలల అపోలో 24/7 సర్కిల్ ఫాస్ట్‌ట్యాగ్, హలో ట్యూన్స్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. Airtel Wynk మ్యూజిక్ కూడా పొందవచ్చు.

రిలయన్స్ జియో ఇటీవల రూ. 256 విలువైన 30-రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను ప్రారంభించింది. Vodafone (Vi) కూడా వరుసగా రూ. 337, రూ. 327 ప్లాన్లపై 31 రోజులు, 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లన్నీ సంబంధిత వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Airtel: తల్లులకు నెలకు రూ.7వేలు అదనంగా ఇస్తామంటోన్న ఎయిర్‌టెల్