Airtel: తల్లులకు నెలకు రూ.7వేలు అదనంగా ఇస్తామంటోన్న ఎయిర్‌టెల్

ఉద్యోగుల కోసం కొత్త పేరెంటల్ బెనిఫిట్స్ అందించేందుకు సిద్ధమైంది ఎయిర్‌టెల్. రీసెంట్‌గా తల్లులైన మహిళా ఉద్యోగులకు నెలకు రూ.7వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది.

Airtel: తల్లులకు నెలకు రూ.7వేలు అదనంగా ఇస్తామంటోన్న ఎయిర్‌టెల్

Airtel

Airtel: ఉద్యోగుల కోసం కొత్త పేరెంటల్ బెనిఫిట్స్ అందించేందుకు సిద్ధమైంది ఎయిర్‌టెల్. రీసెంట్‌గా తల్లులైన మహిళా ఉద్యోగులకు నెలకు రూ.7వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. తమ పిల్లలకు 18నెలలు వయస్సు వచ్చేవరకూ ఇస్తూనే ఉంటామని వెల్లడించింది. పిల్లలను దత్తత తీసుకున్న వారికి కూడా ఈ ప్రత్యేక అలోవెన్స్ లు ఇస్తామని తెలిపారు.

కొత్త తల్లిదండ్రుల చొరవతో విభిన్నమైన, సమగ్రమైన కార్యాలయాన్ని నిర్మించాలనే ఆలోచనలో కంపెనీ ఉంది. కొత్తగా తల్లులైన వారికి సమయం, ద్రవ్య ప్రయోజనాలను అందించే అతి కొద్ది కంపెనీలలో ఎయిర్‌టెల్‌ కూడా ఒకటి కానుంది.

ద్రవ్య ప్రయోజనాలతో పాటు, కంపెనీ మహిళా ఉద్యోగులకు 26 వారాల ప్రసూతి సెలవులను అందిస్తుంది. అదనంగా 24 వారాల సౌకర్యవంతమైన పనిని అందిస్తుంది. కొత్త తల్లులు సొంత శైలితో వేగంగా తిరిగి పనిలోకి రావొచ్చు. వారి నవజాత శిశువుల కోసం సులభంగా సమయాన్ని నిర్వహించగలుగుతారు. కొత్త తల్లులు పిల్లల సంరక్షణ కోసం త్రైమాసికానికోసారి రెండు అదనపు చెల్లింపు సెలవులను కూడా పొందే అవకాశం ఉంది.

Read Also : వినియోగదారులకు ఎయిర్‌టెల్ మరో షాక్..

కొత్త తండ్రులకు కూడా సౌకర్యం కల్పిస్తున్న ఎయిర్‌టెల్ కంపెనీ.. ఎనిమిది వారాల వరకు పితృత్వ సెలవులను అందిస్తుంది.

భారతీ ఎయిర్‌టెల్‌లో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ అమృత్ పెద్దా మాట్లాడుతూ, “పాలసీలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. ఈ కార్యక్రమాలు “భారతి ఎయిర్‌టెల్‌లో తమ కెరీర్‌లను కొనసాగించేందుకు మరింత మంది మహిళలను ప్రోత్సహిస్తాయి” అని ఆమె విశ్వసించారు.