Airtel : వినియోగదారులకు ఎయిర్‌టెల్ మరో షాక్..

ఇప్పటికే ప్రీ పెయిడ్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి వినియోగదారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎయిర్ టెల్.. దాన్ని నుంచి కోలుకోకముందే మరో షాక్ ఇచ్చింది. అదనపు డేటా కూపనన్లు కూడా..

Airtel : వినియోగదారులకు ఎయిర్‌టెల్ మరో షాక్..

Airtel

Airtel : ఇప్పటికే ప్రీ పెయిడ్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి వినియోగదారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎయిర్ టెల్.. దాన్ని నుంచి కోలుకోకముందే మరో షాక్ ఇచ్చింది. అదనపు డేటా కూపనన్లు కూడా ఉపసంహరించుకుంది. యాప్ ద్వారా పలు ప్రీపెయిడ్ ప్లాన్లపై అందిస్తున్న అనదపు డేటా కూపన్లను వెనక్కి తీసుకున్నట్లు ఎయిర్ టెల్ చెప్పింది. వీటి వల్ల వివిధ ప్లాన్ల ఆఫర్లను పోల్చుకోవడంలో గందరగోళం తలెత్తుతోందని వివరించింది. దీన్ని నివారించడానికే కూపన్లను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పింది.

UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను(టారిఫ్డ్ వాయిస్ ప్లాన్స్, అన్ లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్ అప్స్) 20 నుంచి 25 శాతం వరకు పెంచింది ఎయిర్ టెల్. పెరిగిన ధరలు నవంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి యూజర్‌ పై యావరేజ్ రెవెన్యూని (ARPU) పెంచడానికి, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి భారాన్ని తగ్గించుకునేందుకు టారిఫ్‌ను పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపాయి.

Akhanda: జగన్, కేసీఆర్‌కు.. బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్..!

ప్రారంభ స్థాయి ప్లాన్ల ధర దాదాపు 25 శాతం పెరగ్గా, అన్ లిమిటెడ్ వాయిస్ బండిల్స్ ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి. డేటా టాప్‌అప్‌ ప్లాన్స్ ధరలను 20-21 శాతం మేర కంపెనీ పెంచింది. కంపెనీ ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే వినియోగదారుపై సగటు ఆదాయం (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) నెలకు రూ.200కు చేరాలని, తదుపరి రూ.300 కావాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. నెట్‌వర్క్‌ – స్పెక్ట్రమ్‌ కోసం పెట్టుబడులకు, దేశంలో 5జీ సేవల ప్రారంభానికి ఇది అవసరమని వివరించింది.