Akhanda: జగన్, కేసీఆర్‌కు.. బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్..!

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ.. అభిమానులను ఉర్రూతలూగించేలా మాట్లాడారు. వేడుకకు హాజరైన అల్లు అర్జున్, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

10TV Telugu News

Akhanda: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ.. అభిమానులను ఉర్రూతలూగించేలా మాట్లాడారు. వేడుకకు హాజరైన అల్లు అర్జున్, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ కు.. ఆనాటి హాస్యనటుడు అల్లు రామలింగయ్యకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో.. కరోనా ప్రభావం తర్వాత సినిమా రంగం కాస్త ఇబ్బంది పడుతోందని చెప్పారు.

అఖండతో పాటు.. మరెన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. చిరంజీవి చేస్తున్న ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప, రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న RRR.. ఇలా చాలా సినిమాలు విజయవంతం కావాలని బాలకృష్ణ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఇతర హీరోల పేర్లను బాలయ్య చెబుతున్నప్పుడు.. లలితకళావేదిక ప్రాంగణంలో ఉన్న ఆయన అభిమానులు ఈలలతో హోరెత్తించారు.

అలాగే.. సినిమా రంగం కష్టాల్లో ఉందని.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ రంగానికి అండగా నిలవాలని ప్రత్యేకంగా బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా.. దాదాపు రెండేళ్ల పాటు టాలీవుడ్ ఇబ్బందుల్లో పడిందని.. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు వస్తున్నాయని చెప్పిన బాలయ్య.. అందరి హీరోల సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు. ప్రభుత్వాల అండతో.. సినీ రంగం కోలుకోవాలని అన్నారు.

అఖండ గురించి మాట్లాడుతూ.. హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్, దర్శకుడు బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, స్టంట్ మాస్టర్ శివ, డీఓపీ రామ్ ప్రసాద్, కొరియోగ్రాఫర్స్, లిరిక్ రైటర్స్.. అందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. సినిమాను చాలా కష్టపడి రెండేళ్లపాటు తీశామన్న బాలయ్య.. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెంట్ గా చెప్పారు.

×