Be Alert : మీ 2G.. PoS మిషన్స్ Upgrade చేయండి

2G స్పెక్ట్రమ్ సర్వీసులకు కాలం చెల్లింది. కొత్త అడ్వాన్స్ డ్ టెక్నాలజీ 3G, 4G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాయి.

  • Published By: sreehari ,Published On : April 13, 2019 / 10:20 AM IST
Be Alert : మీ 2G.. PoS మిషన్స్ Upgrade చేయండి

2G స్పెక్ట్రమ్ సర్వీసులకు కాలం చెల్లింది. కొత్త అడ్వాన్స్ డ్ టెక్నాలజీ 3G, 4G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాయి.

2G స్పెక్ట్రమ్ సర్వీసులకు కాలం చెల్లింది. కొత్త అడ్వాన్స్ డ్ టెక్నాలజీ 3G, 4G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాయి. అయితే.. ఇప్పటివరకూ కస్టమర్లకు బ్యాంకులు అందించే పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు మాత్రం ఇంకా అప్ గ్రేడ్ కాలేదు. ఈ PoS మిషన్లు 2G టెక్నాలీజీ సర్వీసు ఆధారంగా పనిచేస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో దేశంలో 2జీ టెక్నాలజీ పూర్తిగా నిలిచిపోనుంది. దీంతో టెలికమ్యూనికేషన్ శాఖ బ్యాంకులకు తమ పీఓఎస్ మిషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా సూచిస్తోంది.
Read Also : కొంప, కుటుంబం వద్దా రా : 12 గంటల డ్యూటీ చేసిన చైనా కంపెనీలు

ప్రస్తుతం బ్యాంకింక్ రంగాల్లో వినియోగించే పీఓఎస్ మిషన్లు 2జీ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నాయి. వెంటనే.. పీఓఎస్ మిషన్లను 3జీ లేదా 4జీ టెక్నాలజీ సర్వీసులకు అప్ గ్రేడ్ అవ్వాలని టెలికం శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ యాదవ్ తెలిపారు. పీఓఎస్ మిషన్లను అప్ గ్రేడ్ చేయని పక్షంలో ఫైనాన్షియల్ గా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురువుతుందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పీఓఎస్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం ఎంతో ముఖ్యమని అమిత్ తెలిపారు. ప్రస్తుతం అడ్వాన్స్ డ్ టెక్నాలజీ అందుబాటులో ఉందని చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్ కు సంబంధించి ఇన్స్ స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT)పేరుతో 5G టెక్నాలజీ సర్వీసు ల్యాబ్ ను ప్రారంభించారు. 

5G టెక్నాలజీకి రూట్ మ్యాప్ :
ఈ సందర్భంగా అమిత్ యాదవ్ మాట్లాడుతూ.. అత్యంత అడ్వాన్స్ డ్ 5జీ టెక్నాలజీ సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది. ఈ టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకింగ్ సెక్టార్ లో టెక్నాలజీ సర్వీసులు కూడా అప్ డేట్ కావాల్సి ఉందన్నారు. మూడేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగయ్యాయి. ఎన్నో మొబైల్ టవర్ల నిర్మాణం జరిగింది. రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు మొబైల్ టవర్లు పెరిగిపోయాయి. బేస్ టవర్ స్టేషన్లు (BTS) కూడా 6 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగాయి. మొబైల్ ఫోన్ యూజర్లు కూడా 1.2 బిలియన్ల (120 కోట్లు) మంది పెరిగినట్టు యాదవ్ తెలిపారు.

IDRBT డైరెక్టర్ ఎ.ఎస్. రామశాస్త్రి మాట్లాడుతూ.. 5జీ టెక్నాలజీలోకి మారేందుకు ఇదే సరైన సమయమన్నారు. టెలికం, ఇన్ఫ ర్మేషన్ టెక్నాలజీ, సైన్స్, టెక్నాలజీతో కూడిన బృందం ఇండియాలో 5జీ రోడ్ మ్యాప్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదకను సమర్పించినట్టు చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులకు సంబంధించి 5జీ అప్లికేషన్లపై వైట్ పేపర్ ను IDRBT ఆవిష్కరించింది.  
Read Also : వాడెవడండీ బాబూ : ఆ సీమ పోలింగ్ బూతుల్లో మంత్రించిన ఆవాలు