Amazon: గ్రామీణ పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్‌ సైన్స్‌ విద్య

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ (AFE) పేరుతో గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ (CS) ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ తీసుకొస్తోంది.

Amazon: గ్రామీణ పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్‌ సైన్స్‌ విద్య

Amazon Bid To Take Computer Science Education To Rural India

Amazon Computer Science education : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ (AFE) పేరుతో గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ (CS) ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ తీసుకొస్తోంది. ఈ ప్రొగ్రామ్ విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో క్వాలిటీ CS స్కిల్స్ అందించేందుకు తోడ్పడనుంది. కంప్యూటర్‌ సైన్స్‌ విద్య రంగంలో ఇదో ముందడుగు. తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు గ్రామీణ పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్‌ సైన్స్‌ (CS‌) విద్యను అందించడమే ఈ ప్రొగ్రామ్ ప్రధాన లక్ష్యం. తద్వారా భవిష్యత్తులో గ్రామీణ పాఠశాల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పొందేందుకు వీలుంటుంది. ఈ ప్రొగ్రామ్ మొదటి ఏడాదిలో అమెజాన్ లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పించనుంది. తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలను ఈ CS విద్య కోసం ఎంపిక చేసింది.
TRAI : మినిమం బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్ 2Mbpsకు పెంచాలి.. 50 శాతం రీయంబర్స్‌మెంట్!

అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా 6–12 తరగతి విద్యార్థులకు కంప్యూటర్ టీచింగ్ అందించనుంది. కోడింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, నేచురల్‌ ల్యాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి ఫ్యూచర్ సెంట్రలైజేషన్ టెక్నికల్ కోర్సులను భారతీయ భాషల్లో అందించనుంది. టెక్నికల్ రంగంలో అవకాశాలను అమెజాన్‌ నిపుణుల ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. అమెజాన్‌ సైబర్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌ ప్రొగ్రామ్ ద్వారా ప్రోగ్రామింగ్‌ బేసిక్స్, కోడింగ్‌ ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చు.

ఇంటర్న్‌షిప్స్, హాకథాన్స్, ఉపకార వేతనాలు, మార్గదర్శకత్వం లభించనుంది. ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. భారత్‌లో క్వాలిటీ సీఎస్‌ను తీసుకొచ్చేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌ Code.org అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్‌ పనిచేస్తోంది. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ ప్రొగ్రామ్ విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. AFE ప్రొగ్రామ్ అమలుకు కంప్యూటర్ విద్యారంగానికి సేవలు అందిస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్‌ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. కంప్యూటర్ విద్యను యువత ముందస్తుగా నేర్చుకోవడం ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుందన అమెజాన్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు.
Radhika Apte : వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను : బోల్డ్ బ్యూటీ