Radhika Apte : వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను : బోల్డ్ బ్యూటీ

రాధిక పెళ్లి వ్యవస్థపై కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లి వ్యవస్థ పైన నమ్మకం లేదని ఓపెన్‌గానే

Radhika Apte :  వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను : బోల్డ్ బ్యూటీ

Radhika

Radhika Apte :  బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే ఎప్పుడూ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూనో, లేదా సినిమాల్లో చాలా బోల్డ్ గా నటించో ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతుంది. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చింది. రాధికా ఆప్టే తెలుగులో కూడా లెజెండ్ , లయన్ సినిమాల్లో బాలకృష్ణతో కలిసి నటించింది. ఇక బాలీవుడ్ లో అయితే చాలా సినిమాలు, సిరీస్ లు చేస్తోంది. రాధికా ఆప్టే నగ్నంగా కూడా నటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇదివరకే సినిమాల్లో నగ్నంగా నటించడానికి నాకేమి ఇబ్బంది లేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది.

తాజాగా రాధిక పెళ్లి వ్యవస్థపై కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లి వ్యవస్థ పైన నమ్మకం లేదని ఓపెన్‌గానే చెప్పింది రాధిక. మరి పెళ్లెందుకు చేసుకున్నారు అని అడిగితే కేవలం వీసా కోసమే చేసుకున్నానంటూ సంచలన సమాధానం చెప్పింది.

Allu Arjun : అల్లు అర్జున్ తన వైఫ్ ని ఏమని పిలుస్తాడో తెలుసా??
కొన్నేళ్ల క్రితం రాధికా ఆప్టే బ్రిటన్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను పెళ్లి చేసుకుంది. బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రాధిక ఎక్కువగా ఇండియాలోనే ఉంటుంది. ఇక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అప్పుడప్పుడూ తన భర్త కోసం లండన్ వెళ్తుంటుంది. కెరీర్ కోసం పెళ్లి జీవితం త్యాగం చేస్తున్నారా అని అడిగితే అసలు తనకి పెళ్లిపై నమ్మకం లేదని తేల్చి చెప్పేసింది. నా జీవితానికి హద్దులు లేవని, నేను వివాహాన్ని నమ్మే వ్యక్తిని కానని గట్టిగానే చెప్పింది. ఇద్దరం కలిసి జీవించాలనుకున్నాం అంతే కానీ ఈ పెళ్లి గిల్లి అనేది నమ్మకం లేని పని అని వివరంగా చెప్పేసింది. చివరగా విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వీసా ఈజీగా వస్తుందని తెలిసి ఆ బ్రిటిష్ అతను నచ్చటంతో చేసుకున్నాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.