Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్!

పండుగ సీజన్ మొదలైంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు పోటీపడి ఆఫర్లు మీద ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 ప్రారంభమైంది.

Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్!

Amazon Great Indian Festival Sale Now Live For Prime Members

Amazon Great Indian Festival 2021 : పండుగ సీజన్ మొదలైంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు పోటీపడి ఆఫర్లు మీద ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021  ప్రారంభం కానుంది. అయితే Amazon Prime Subscribers కోసం ప్రత్యేకించి ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. అక్టోబర్ 2 అర్ధరాత్రి నుంచే ఈ మెగా సేల్ ప్రారంభం కానుంది. అందరూ కస్టమర్లకు అమెజాన్ మెగా సేల్ అందుబాటులోకి రానుంది. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్లు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.
Pushpa : పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది.. సోలోగా వస్తున్న ఐకాన్ స్టార్

ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్, ఆపిల్, వన్‌ప్లస్, Mi, Redmi మొబైల్స్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మొబైల్ ఆఫర్లకు సంబంధించి అమెజాన్ టీజ్ రిలీజ్ చేసింది.
2019లో రిలీజ్ అయిన ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ రూ.40 వేలలోపు ధరకే లభ్యం కానుంది. అమెజాన్ అధికారిక మైక్రోసైట్లో పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ S20FE 5G స్మార్ట్ ఫోన్ ధరను రూ.70,499 నుంచి రూ.36,999కు భారీగా తగ్గింపుతో అందిస్తోంది.

వన్‌ప్లస్ 9 నార్డ్ 2 5G ఫోన్ ధర రూ.28,499 ధర నుంచి అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ 9R 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఈ ఫోన్ రూ.36,999కే సొంతం చేసుకోవచ్చు. IQoo z3 రూ.15,490 నుంచి ప్రారంభం కానుంది. రెడ్‌మీ 9 స్మార్ట్ ఫోన్ ధర రూ.7,920 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

రెడ్‌మీ నోట్ 10pro స్మార్ట్ ఫోన్ ధర రూ.16,990 భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్‌ 9pro సుమారు 50 వేల లోపే తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ రూ. 40 వేల కన్నా తక్కువ ధరలో లభించనుంది. స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లతో పాటు కొనుగోళ్లపై స్పెషల్ బ్యాంకు క్యాష్ ఆఫర్లను కూడా పొందవచ్చు. Apple Airpods Pro ధర రూ.24,900 ఉండగా.. అమెజాన్ సేల్ సందర్భంగా రూ.16,990కే సొంతం చేసుకోవచ్చు.
BiggBoss : బిగ్ బాస్ లో కొత్త లవ్ స్టోరీ.. ముద్దులతో గుడ్ నైట్..