మిలియనీర్ కుమారుడికి ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్

  • Published By: chvmurthy ,Published On : November 13, 2019 / 04:13 PM IST
మిలియనీర్ కుమారుడికి ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్

మిలియనీర్ కుమారుడికి తన కంపెనీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే….గుజరాత్ కు చెందిన మిలియనీర్, ఆయిల్ ట్రేడర్ రాకేష్ థక్కర్ కుమారుడు ద్వారకేష్ థక్కర్, చదువు మానేసి ఇంట్లోంచి పారిపోయి సిమ్లాలోని ఒక రోడ్డు పక్క హోటల్ లో అంట్లు శుభ్రం చేసే పనిలో చేరాడు. చదువు పట్ల ఆసక్తి లేకపోవటం, తనను తాను ప్రూవ్ చేసుకోదలిచి, సొంతంగా జీవితంలో ఎదగాలనే సంకల్పంతో ఆస్తి,పాస్తులు అన్నీ వదిలి అక్టోబరు14న ఇల్లు వదిలి ఢిల్లీ రైలెక్కి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సిమ్లా వెళ్లి అక్కడ ఒక రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో అందరూ తిన్న ఎంగిలి ప్లేట్లు కడిగే పనిలో కుదిరాడు. ఈ లోపు తండ్రి రాకేష్ థక్కర్ తన కుమారుడు కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రకటన ఇచ్చాడు.  హోటల్ లో చేరిన ద్వారకేష్ రోజూ హోటల్లో అంట్లుతోమి రోడ్డుపక్కనే పడుకునేవాడు. తండ్రిఇచ్చిన ప్రకటన చూసిన ఒక ఆటో డ్రైవర్ ద్వారకేష్నుగుర్తించాడు. వడోదరలోని అక్షర్ చౌక్ వద్ద ద్వారకేష్ను వదిలివేసినట్లు అతను చెప్పాడు.

ఉద్యోగం కోసం ద్వారకేష్  సిమ్లాలోని ఒకహోటల్ కు వెళ్లగా అక్కడి మేనేజర్ కు, ద్వారకేష్ రూపాన్ని చూసి అనుమానం వచ్చి అతడి ఐడీ కార్డులు పరిశీలించి పంపించి వేశాడు. తప్పిపోయిన ప్రకటన చూసిన హోటల్ మేనేజర్ పద్రా పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రాత్రి పూట రోడ్డుపై నిద్రిస్తున్న వాళ్లను గుర్తించిన పోలీసులు ద్వారకేష్ ను పట్టుకుని పోలీసుస్టేషన్ కు తీసుకు వచ్చారు. తండ్రి రాకేష్ కి సమాచారం ఇచ్చారు. పిల్లవాడు దొరికిన సంగతి తెలిసిన రాకేష్ థక్కర్ సిమ్లాకు వెళ్ళాడు. కానీ ఇంటికి వెళ్లటానికి ద్వారకేష్ నిరాకరించాడు. చదువు పట్ల ఆసక్తి లేదని చెప్పాడు.తన కాళ్లమీద తాను నిలబడతానని చెప్పాడు. ఓ మిలీనియర్‌ కొడుకు హోటల్ లో అంట్లు శుభ్రం చేస్తున్న దృశ్యాలు  తర్వాత రోజు పేపర్లలో ప్రధాన వార్తగా వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆనంద్‌.. ద్వారకేష్ కు తన కంపెనీలో ఇంటర్నషిప్‌ చేసే అవకాశం కల్పించారు. 

ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ఆఫర్ ను అంగీకరిస్తానని ద్వారకేష్ చెప్పాడు. కంపెనీ అధికారులను త్వరలోనే  కలుస్తానన్నాడు. భవిష్యత్తులో ద్వారకేష్  గొప్ప పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడని ఆనంద్ మహీంద్ర చెప్పారు. ఆనంద్ మహీంద్ర ఆఫర్‌ చేసిన ఇంటర్నషిప్‌పై  రాకేష్ స్పందిస్తూ తన కుమారుడికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యముందని, కచ్చితంగా ఏదో ఒక రోజు నెరవెరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

anandmahindra