Twitter: ట్విట్టర్‌లో ఎనిమిదోసారి ఉద్యోగాల కోత.. ఈసారి ఎంత మందిని తొలగించారంటే..

గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు ఏడు దశల్లో ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా ఎనిమిదోసారి ఉద్యోగుల్ని తొలగించింది. శనివారం మరి కొంత మంది ఉద్యోగుల్ని తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి 50 మందికిపైగా సిబ్బందిని ట్విట్టర్ తొలగించింది.

Twitter: ట్విట్టర్‌లో ఎనిమిదోసారి ఉద్యోగాల కోత.. ఈసారి ఎంత మందిని తొలగించారంటే..

Twitter: ఎలన్ మస్క్ ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఆ సంస్థలో ఉద్యోగాల కోత ప్రారంభమైంది. అనేక టెక్ సంస్థల్లాగే ట్విట్టర్ కూడా భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తోంది. అయితే, ఈ విషయంలో ఇతర సంస్థలకంటే ట్విట్టర్ ముందుంటోంది.

Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు

గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు ఏడు దశల్లో ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా ఎనిమిదోసారి ఉద్యోగుల్ని తొలగించింది. శనివారం మరి కొంత మంది ఉద్యోగుల్ని తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి 50 మందికిపైగా సిబ్బందిని ట్విట్టర్ తొలగించింది. ఇటీవలి కాలంలో ఎనిమిదిసార్లు ఉద్యోగుల్ని తొలగించిన సంస్థ ట్విట్టర్ కాకుండా మరోటి లేదు. ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ గత అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. ఆ వెంటనే సంస్థలోని కీలక ఉద్యోగుల్ని తొలగించారు. నవంబర్‌లో 3,700 మంది ఉద్యోగుల్ని తొలగించారు.

Vande Bharat Express: వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం

ఇప్పటివరకు ఇలా మొత్తం ఎనిమిదిసార్లు అనేక మందిని తొలగించారు. మొత్తంగా 70 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు అంచనా. సంస్థ నిర్వహణా వ్యయాల్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగానే ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మస్క్ గతంలో ప్రకటించారు. అలాగే అనేక చోట్ల ఆఫీసుల్ని మూసేస్తున్నారు. చివరకు ఫర్నీచర్ కూడా అమ్మేస్తున్నారు. అడ్వర్టైజర్ల ద్వారా వచ్చే రెవెన్యూ తగ్గడం కూడా ఉద్యోగుల తొలగింపునకు కారణమవుతోంది. ట్విట్టర్ బాటలోనే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి.