Apple Store in Mumbai : ముంబైలో ఆపిల్ ఫస్ట్ స్టోర్ ప్రారంభం.. BKC స్టోర్ ఓపెనింగ్‌కు భారీగా పోటెత్తిన కస్టమర్లు..!

Apple Store in Mumbai : ముంబైలో ఆపిల్ ఫస్ట్ స్టోర్ ప్రారంభమైంది. BKC ఆపిల్ స్టోర్‌ను కంపెనీ సీఈఓ టీమ్ కుక్ (Tim Cook) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆపిల్ స్టోర్ సందర్శించేందుకు ఆపిల్ కస్టమర్లు, అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు.

Apple Store in Mumbai : ముంబైలో ఆపిల్ ఫస్ట్ స్టోర్ ప్రారంభం.. BKC స్టోర్ ఓపెనింగ్‌కు భారీగా పోటెత్తిన కస్టమర్లు..!

Apple BKC Store opening_ Twitter reacts to long queues outside Apple Mumbai st

Apple Store in Mumbai : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) భారత్‌లోని ముంబైలో మొట్టమొదటి అధికారిక స్టోర్‌ను ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌ (Jio World Drive Mall)లో ఉన్న ఈ స్టోర్.. ఆపిల్ రెండు అవుట్‌లెట్‌లలో మొదటిది. ఆపిల్ సీఈఓ (Apple CEO Tim Cook) టిమ్ కుక్ ఏప్రిల్ 18 (మంగళవారం) ఉదయం 11 గంటలకు ముంబై ఆపిల్ స్టోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆపిల్ తమ కస్టమర్లను అధికారికంగా స్టోర్‌లోకి స్వాగతం పలికింది.

ముంబైలో ఆపిల్ స్టోర్ స్టోర్ ఓపెన్ చేయడానికి ముందే ఆపిల్ కస్టమర్లు వందల సంఖ్యలో స్టోర్ ముందు క్యూ కట్టేశారు. స్టోర్ తెరవడానికి కొన్ని గంటల ముందే (Apple BKC) వద్ద క్యూలో నిలబడ్డారు. దేశంలోనే అతిపెద్ద ముంబై ఆపిల్ స్టోర్ BKCలో 20కిపైగా భాషలు మాట్లాడే 100 కన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ఆపిల్ BKC స్టోర్, ఆపిల్ ప్రొడక్టులు, సర్వీసులను పొందడానికి వీలుగా కస్టమర్లకు ఒక లైవ్లీ హబ్‌గా రూపొందించింది. ముంబైకి చెందిన ఈ స్టోర్ ఉదయం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించిన అనంతరం వేడుకల్లో పాల్గొనున్నారు.

Read Also : Apple Retail Stores : భారత్‌లో ఫస్ట్ ఆపిల్ రిటైల్ స్టోర్లు.. ముంబై కన్నా ఢిల్లీ స్టోర్ చాలా చిన్నదట.. నెలకు ఎంత అద్దె కడుతుందో తెలిస్తే షాకవుతారు..!

స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా వేలాది మంది ఆపిల్ అభిమానులు, టెక్ ఔత్సాహికులు స్టోర్ వెలుపల వరుసలో నిలబడ్డారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ఉన్న స్టోర్ నుంచి ఆపిల్ ప్రొడక్టులను వీక్షించవచ్చు. ఇష్టమైన ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు. భారతీయ మార్కెట్‌లో ఆఫ్‌లైన్ ఉనికిని పెంచుకునేందుకు ఇతర పోటీదారు సౌత్ కొరియన్ దిగ్గజం శామ్‌సంగ్‌కు పోటీగా ఆపిల్ ఈ స్టోర్‌ను ప్రారంభించింది.

Apple BKC Store opening_ Twitter reacts to long queues outside Apple Mumbai st

Apple BKC Store opening_ Twitter reacts to long queues outside Apple Mumbai st

Apple BKC స్టోర్ ప్రారంభోత్సవానికి దాదాపు 5వేల మంది టెక్ ఔత్సాహికులు హాజరయ్యారు. వీరిలో కొందరు ఉదయం 8 గంటలకే స్టోర్ వద్దకు చేరుకున్నారు. ముంబై స్టోర్ అధికారికంగా ఓపెన్ చేయడానికి దాదాపు మూడు గంటల ముందే వందల సంఖ్యలో చేరుకున్నారు. ఆపిల్ సోమవారం స్టోర్ ప్రత్యేక ప్రివ్యూను కూడా నిర్వహించింది. అంతేకాదు.. కొంత మంది మీడియా నిపుణులకు కూడా స్టోర్‌లో ప్రత్యేకంగా అనుమతి కల్పించారు.

ముంబై స్టోర్‌లో ఆపిల్ ప్రొడక్టుల్లో MacBooks, iPhoneలు, iPadలు, గడియారాలు భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపిల్ అన్ని ప్రొడక్టులను ఇక్కడే విక్రయిస్తుంది. దీంతో పాటు, ఆపిల్ ఆర్కేడ్, ఆపిల్ HomePod, Apple Music, Apple TV+ని కూడా ప్రదర్శిస్తుంది. సందర్శకులకు అవసరమైన సాయం అందించేందుకు స్టోర్ మొదటి అంతస్తులో జీనియస్ బార్ కూడా ఉంది.

గత రెండు ఏళ్లుగా ఆపిల్ భారతీయ మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికా-చైనా ఉద్రిక్తతల మధ్య చైనా వెలుపల తయారీని వైవిధ్యపరచేందుకు ఆపిల్ చైనా-ప్లస్-వన్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. అందులో చాలావరకు భారత్ తన ప్రధాన తయారీ కేంద్రంగా ఆవిర్భవించటానికి ఇదే కారణమని చెప్పవచ్చు. 2017లో భారత్‌లో పాత ఐఫోన్ మోడల్‌ల తయారీని ప్రారంభించింది. గత ఏడాది నుంచి లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. Apple BKC దేశంలోనే మొదటి స్టోర్ కాగా, మరొకటి ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో ఓపెన్ కానుంది.

Read Also : Apple Mumbai Store : ఆపిల్ ముంబై స్టోర్ ఫస్ట్ లుక్ అదుర్స్.. ఏప్రిల్ 18న కస్టమర్లకు స్పెషల్ ఎంట్రీ..!