Apple Exclusive Stores : భారత్‌కు రానున్న మరో 3 కొత్త ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్‌లు.. లాంచ్ ఎప్పుడు? లొకేషన్ ఎక్కడ? పూర్తి వివరాలివే..!
Apple Exclusive Stores : ఆపిల్ ఇండియా (Apple India)లో వివిధ ప్రదేశాలలో మరో 3 ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ స్టోర్‌లను ప్రారంభించనుంది. టెక్ దిగ్గజం ముంబై శివారులోని బోరివాలిలో మూడో స్టోర్‌ను ఓపెన్ చేసేందుకు ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. 2025లో ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్‌లను ప్రారంభించనుంది.

Apple likely to open 3 more exclusive stores in India
Apple Exclusive Stores in India : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియా (Apple India) మరో 3 ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ స్టోర్‌లను ప్రారంభించనుంది. ఎందుకంటే.. అన్ని స్టోర్‌లు ఒకే సమయంలో ప్రారంభించే అవకాశం లేదు. దేశంలో ఆపిల్ ఇటీవలే మొట్టమొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో ప్రారంభించింది. ఇప్పుడు మరిన్ని అవుట్‌లెట్‌లు ఇండియాకు వస్తున్నాయి. బ్లూమ్‌బెర్గ్ వివరాల ప్రకారం.. భారత్ మాత్రమే కాదు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 15 కొత్త అవుట్‌లెట్‌లను తెరవాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ మార్కెట్ కోసం కంపెనీ ప్లాన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి.
ఆపిల్ ఇండియాలో మరో 3 ప్రత్యేక స్టోర్‌లను తెరవనున్నట్లు తెలిపింది. లొకేషన్ జాబితా, లాంచ్ టైమ్ ఎప్పుడు అనేది స్పష్టత లేదు. వివిధ ప్రదేశాలలో మరో 3 ప్రత్యేకమైన స్టోర్లను ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టెక్ దిగ్గజం ముంబై శివారులోని బోరివాలిలో మూడో స్టోర్‌ను తెరవడానికి ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. అయితే, 2025లో మూడు కొత్త ఆపిల్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. దేశంలోని 4వ ఆపిల్ స్టోర్ 2026లో తెరిచేందుకు కంపెనీ ప్రతిపాదించింది.
న్యూఢిల్లీలో DLF ప్రొమెనేడ్ మాల్‌లో ఈ స్టోర్ ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సైట్ తర్వాత భారత మార్కెట్లో రెండో అతిపెద్ద ఆపిల్ స్టోర్ కానుంది. 2027లో, ఆపిల్ మరో స్టోర్‌ని ప్రారంభించాలని యోచిస్తోంది. అది కూడా ముంబై నగరంలోనే మరొకటి ప్రారంభించనుంది. ఇంతకీ నగరంలో లొకేషన్ ఎక్కడ అంటే.. సముద్రతీర వర్లీ ప్రాంతం అని నివేదిక తెలిపింది. అన్ని అవుట్‌లెట్‌లు ఒకే సమయంలో వచ్చే అవకాశం లేదు. 2027 వరకు భారత్‌లో ప్రతి ఏడాదిలో ఒక కొత్త ప్రత్యేకమైన ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

Apple likely to open 3 more exclusive stores in India
భారత్‌లోనే మరిన్ని ఆపిల్ స్టోర్లు ఎందుకంటే? :
ఆఫ్‌లైన్ స్టోర్‌ల విస్తరణపై ఆపిల్ దృష్టిపెట్టింది. అమెరికా, యూరప్‌లో స్థాపించిన లొకేషన్లను సవరిస్తూ చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలకు ఆపిల్ రిటైల్ స్టోర్లను విస్తరిస్తోంది. దీనికి మరో కారణం.. బహుశా భారతీయ మార్కెట్‌లో అధిక అమ్మకాలు, అధిక లాభాలు పొందడమే కారణం కావొచ్చు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్లు నెలకు 22-25 కోట్లు ఆర్జిస్తున్నాయని లేటెస్ట్ రిపోర్టు పేర్కొంది.
టెక్ దిగ్గజం రిటైల్ స్టోర్ల ద్వారా ప్రతి నెలా మొత్తం 50 కోట్లు సంపాదిస్తున్నదని అర్థం. దేశంలోని ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్లు ఆర్జిస్తున్న దాని కన్నా ఈ మొత్తం 2 రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. ఆపిల్ కొత్త స్టోర్‌లను ఓపెన్ చేయడానికి ఆదాయంలో పెరుగుదల ఒకటి కారణం కావచ్చు. ఎందుకంటే.. ఆపిల్ డివైజ్‌లు చాలా ప్రీమియం ధరకు అమ్ముడవుతాయి. దేశంలో ఆపిల్ ప్రొడక్టుల సేల్ ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, కంపెనీ ఇప్పటికీ భారీగా లాభాలను పొందుతూనే ఉంది.