Apple Workers : పెరగనున్న ఆపిల్ ఉద్యోగుల జీతాలు.. ఎంతంటే?

Apple Workers : ప్రముఖ కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆపిల్ ఉద్యోగుల వేతనాలను పెంచనుంది. అమెరికాలోని ఆపిల్ ఉద్యోగుల జీతాలను 10 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచనుంది.

Apple Workers : పెరగనున్న ఆపిల్ ఉద్యోగుల జీతాలు.. ఎంతంటే?

Apple To Hike Salaries Of Its Workers By 10 Per Cent

Apple Workers : ప్రముఖ కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆపిల్ ఉద్యోగుల వేతనాలను పెంచనుంది. అమెరికాలోని ఆపిల్ ఉద్యోగుల జీతాలను 10 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచనుంది. ఉద్యోగులు పనివేళలకు సంబంధించి వేతనాన్ని కనీసం 22 డాలర్లకు పెంచనున్నట్టు కుపెర్టినో-దిగ్గజం ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది కన్నా 10 శాతం ఎక్కువ.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆపిల్ ఉద్యోగులు పని పరంగా ఎదుర్కొంటున్న పరిస్థితులపై కంపెనీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఆపిల్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో వార్షిక పనితీరు సమీక్ష ప్రక్రియలో భాగంగా ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకుందని ఆపిల్ ప్రతినిధి వాల్ స్ట్రీట్ జర్నల్‌తో అన్నారు. ఆపిల్ కంపెనీ గతంలో ఫిబ్రవరి 2022లోనే ఉద్యోగుల జీతాలను పెంచింది. ఒక ఏడాదిలో ఆపిల్ తమ ఉద్యోగుల జీతాలను రెండోసారి పెంచుతోంది.

Apple To Hike Salaries Of Its Workers By 10 Per Cent (1)

Apple To Hike Salaries Of Its Workers By 10 Per Cent 

యాపిల్ రిటైల్ వర్కర్లు స్టోర్‌లలో పనిచేస్తున్నారు. గతకొద్దిరోజులుగా వీరంతా పనిభారంతో అధిక వేతనం, అదనపు ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నారు. సెలవులతో పాటు పదవీ విరమణ వంటి అంశాలపై అదనపు ప్రయోజనాలను కోరుతూ వర్కర్లు డిమాండ్ చేశారు.

బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఆపిల్ ఇప్పుడు రిటైల్ కార్పొరేట్ గ్రూపుల కోసం వార్షిక పనితీరు ఆధారిత వేతనాల పెంపునకు రెడీ అవుతోంది. జార్జియా, మేరీల్యాండ్, న్యూయార్క్, కెంటుకీలతో సహా అమరికాలోని అనేక ప్రాంతాలలో యూనియన్ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చేందుకు ఆపిల్ ప్రయత్నిస్తోంది.

Read Also : Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!