FASTag‌ : టోల్ ప్లాజాల వద్ద పెరిగిన నిరీక్షణ

  • Published By: madhu ,Published On : January 17, 2020 / 07:00 AM IST
FASTag‌ : టోల్ ప్లాజాల వద్ద పెరిగిన నిరీక్షణ

FASTag..వల్ల టోల్ గేట్ల వద్ద వాహనదారుల వేచి చూసే సమయం పెరిగిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకు ముందు నగదు చెల్లించి ముందుకెళ్లే వారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని ముందుకు తెచ్చింది. ఇది తీసుకోవడం కంపల్సరీ అని నొక్కి చెబుతోంది. పాస్టాగ్ తీసుకున్న వారు..టోల్ గేట్ వద్దకు రాగానే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

 

2019 డిసెంబర్, 2020 జనవరి మధ్యలో 29 శాతం పెరిగిందనే లెక్కలు చూపిస్తున్నాయి. టోల్ వసూళ్లలో మాత్రం 60శాతం పెరిగిందని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడిస్తోంది. 488 టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టంను పరిశీలించారు. టోల్ గేట్ల వద్ద 2019, నవంబర్ 15, 2019 డిసెంబర్ 14 మధ్య వాహనదారుడు 7 నిమిషాల 44 సెకన్లు వెయిట్ చేశారని డేటా వెల్లడిస్తోంది.

 

2019 డిసెంబర్ 15, 2020 జనవరి 14 మధ్య ఒక వాహనదారుడు 9 నిమిషాల 57 సెకన్ల పాటు వెయిట్ చేయాల్సి వస్తోందని డేటా చూపించింది. ఫాస్టాగ్ వల్ల కొన్ని టెక్నికల్ సమస్యలు, ఇతరత్రా కారణమని తెలుస్తోంది. అదే 2018 సంవత్సరంలో డిసెంబర్ 15న 10 నిమిషాల 4 సెకన్ల పాటు వాహనదారుడు వెయిట్ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. 

ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇది వాహనం ముందున్న అద్దంపై అతికించబడుతుంది. వాహనం టోల్ ప్లాజా వద్దకు రాగానే అక్కడ ఏర్పాటు చేసిన పరికరం స్కాన్ చేస్తుంది. అంతకుముందు బ్యాంకుతో అనుసంధానం చేయడం వల్ల ఆటోమెటిక్‌గా బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు కట్ అవుతుంది.

 

ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వైపు మళ్లించే విధంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ్స్ కొనిపించాలని నిర్ణయించింది. ఫాస్టాగ్ విధానం సంక్రాంతి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనివల్ల వాహనదారుడు అధిక సమయం వెయిట్ చేయాల్సి వస్తుందనే డేటా రావడంతో..ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. 

Read More : సెలబ్రెటీల వైపు BJP చూపు..పవన్‌ కళ్యాణ్‌తో బలం పెరుగుతుందా