Joy E-Bike: ఈ బైక్‌లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి అయ్యే ఖర్చు 115 రూపాయలే! ధర ఎంతంటే?

పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో ఎలక్ట్రిక్ బైక్‌లకు మంచి స్పందన వస్తోంది.

Joy E-Bike: ఈ బైక్‌లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి అయ్యే ఖర్చు 115 రూపాయలే! ధర ఎంతంటే?

E Bike

Joy E-Bike: పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో ఎలక్ట్రిక్ బైక్‌లకు మంచి స్పందన వస్తోంది. లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ఓ ఎలక్ట్రిక్ బైక్.. కేవలం 23 పైసలకు 1 కిలోమీటరు నడుస్తుంది. అంతేకాదు.. పెట్రోల్‌తో నడిచే మోటార్‌సైకిల్ కంటే దీని ధర చాలా తక్కువగా ఉంది.

జాయ్ ఇ-బైక్ మాన్‌స్టర్. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ఈ బైక్‌లో 500 కిలోమీటర్లు నడవడానికి అయ్యే ఖర్చు కేవలం 115 రూపాయలే. క్లెయిమ్ ప్రకారం, ఇది 72 V, 39 AH లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బైక్ 1500W DC బ్రష్‌లెస్ హబ్ మోటార్‌తో పనిచేస్తుంది.

జాయ్ ఇ-బైక్ మాన్‌స్టర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 నుండి 5.5 గంటల సమయం పడుతుంది. దీని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి, 3.3 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కి.మీ కాగా.. ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.98,666గా ఉంది. మార్కెట్లో, ఇది Komaki MX3, Komaki M-5, Revolt Motors RV 400 వంటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.