Best Recharge Plan: రూ. 197కే 150రోజుల వాలిడిటీ.. అద్భుతమైన ప్లాన్‌ ఇదే!

రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా రూ. 199 ప్లాన్‌ను అందిస్తే, BSNL కూడా రూ. 197కే కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 150 రోజుల వాలిడిటీని అందిస్తోంది.

Best Recharge Plan: రూ. 197కే 150రోజుల వాలిడిటీ.. అద్భుతమైన ప్లాన్‌ ఇదే!

Jio Bsnl

Best Recharge Plan: రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా రూ. 199 ప్లాన్‌ను అందిస్తే, BSNL కూడా రూ. 197కే కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 150 రోజుల వాలిడిటీని అందిస్తోంది. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL). ఇంటర్నెట్ డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా కల్పించారు. ఇది రిలయన్స్ జియో మరియు వోడాఫోన్-ఐడియా రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్‌తో పోటీపడుతుంది.

బీఎస్ఎన్ఎల్ 197 ప్లాన్:
కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 197తో అన్ని సర్కిల్‌లలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. వినియోగదారులకు 150 రోజుల వాలిటిటీతో ఈ ప్లాన్ ఇవ్వబడింది. ఇందులో మొదటి 18 రోజుల పాటు 2GB హై-స్పీడ్ డేటా మాత్రమే ఇవ్వబడుతుంది. దీని తర్వాత, మిగిలిన వాలిడిటీలో 40Kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. వినియోగదారులు ఉచిత ఇన్‌కమింగ్ కాల్‌లను కూడా పొందవచ్చు. అవుట్‌గోయింగ్ కాల్స్ కోసం మాత్రం టాప్-అప్ చేయాల్సి ఉంటుంది. ఉచిత SMS సౌకర్యం కూడా ఉంది.

జియో 199 ప్లాన్:
ఇతర కంపెనీలతో పోలిస్తే, రిలయన్స్ జియో రూ. 199 రీఛార్జ్‌లో 23 రోజుల చెల్లుబాటు ఇచ్చింది. ఇందులో కస్టమర్లకు రోజూ 1.5 జీబీ డేటా ఇస్తుంది కంపెనీ. మొత్తం డేటా 34.5GB అవుతుంది. ఇందులో ఉచితంగా అవుట్‌గోయింగ్ కాల్స్, రోజూ 100 మెసేజ్‌లు పంపుకునే సదుపాయం ఇస్తుంది. ఇందులో జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను కస్టమర్లకు ఉచితంగా అందజేస్తుంది.

Vodafone-Idea 199 Plan:
Vodafone-Idea కూడా అదే ధరతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. కంపెనీ ఈ రీఛార్జ్‌లో, 18 రోజుల పాటు ప్రతిరోజూ 1 GB డేటా ఇస్తుంది. ఇది 18 రోజుల పాటు 18GB అవుతుంది. ఇందులో ఉచితంగా అవుట్‌గోయింగ్ కాల్స్, రోజూ 100 మెసేజ్‌లు పంపుకునే సదుపాయం కల్పించనున్నారు. ఇది కాకుండా, Vi Movies & TV Basic ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.