నేడే విలీనం: ఇకపై ఆ బ్యాంకులు కనిపించవు

  • Published By: vamsi ,Published On : April 1, 2019 / 01:39 AM IST
నేడే విలీనం: ఇకపై ఆ బ్యాంకులు కనిపించవు

దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా నేటి(01 ఏప్రిల్ 2019) నుంచి అవతరించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా సిద్దమైంది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన విజయబ్యాంక్‌, దేనా బ్యాంక్‌లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం కానున్నాయి. ఇకపై విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ బ్రాంచులు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచులుగా కష్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా కష్టమర్లుగా మారనున్నారు. ఈ పరిణామాన్న మార్చి 30వ తేదీన రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

ఈ విలీనం సాఫీగా జరిగేందుకు ప్రభుత్వం రూ.5,042కోట్లను బీవోబీలో పెట్టాలని నిర్ణయిచింది. అదనపు ఖర్చుల కోసం వీటిని కేంద్రం అందిస్తుంది. ప్రతి 1000 విజయాబ్యాంక్‌ షేర్లకు 402 బీవోబీ షేర్లు లభిస్తాయి. అదే సమయంలో ప్రతి 1000 దేనా బ్యాంక్‌ షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఈ బ్యాంకుల విలీనం అంశంను తెరపైకి తెచ్చింది. మూడు బ్యాంకుల వ్యాపారం విలువ రూ.14.82 లక్షల కోట్లుగా నిర్ణయించారు. తాజా విలీనంతో దేశంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ తర్వాత ఈ బ్యాంకే అతిపెద్దది అయింది.

కస్టమర్లు తెలుసుకోవలసిన విషయాలు:
బ్యాంకులు విలీనమైన తర్వాత అకౌంట్స్, లాకర్, డిపాజిట్స్, లోన్స్ అన్నీ కొత్త బ్యాంకు పరిధిలోకి వస్తాయి. కస్టమర్లకు బ్యాంకు నుంచి ఇ-మెయిల్, లెటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తుంటాయి.

1. బ్యాంకుల విలీనం వల్ల కస్టమర్లకు లాభాలు బాగానే ఉంటాయి.
2.  బ్యాంకులు విలీనం వల్ల తమ బ్యాంకులు ఎత్తేశారా? అనే ఆందోళన కొంతమందికి ఉంటుంది. అటువంటి ఆందోళనలు అక్కర్లేదు.
3. విలీనం అయ్యే బ్యాంకుల్లో ఉన్న డబ్బులు సురక్షితంగానే ఉంటాయి.
4. అసలు విలీనం ఎందుకు చేస్తున్నారో అధ్యయనం చేయండి.
5. కొత్తగా రూపాంతరం చెందే బ్యాంకు ఛార్జీలు, సేవలు తెలుసుకోండి.
6. ఉచిత సేవలు, ఛార్జీలు, డిపాజిట్లకు, రుణాలకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కోండి.
7. మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి. ఎందుకంటే కొత్త బ్యాంకులో నియమ, నిబంధనలు మారే అవకాశం ఉంటుంది. 
8.  పుకార్లను పట్టించుకోకుండా అధికారికంగా వచ్చే ప్రకటనలను మాత్రమే నమ్మండి
9. కొత్త వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసేముందు అది బ్యాంకు సైట్ అవునో కాదో చూసుకోండి.(ఫేక్ సైట్లు కూడా ఉండవచ్చు)
10. కచ్చితంగా ఒకసారి బ్యాంకుకు వెళ్లి ఏమేం చేయాలి, కొత్త కార్డులు, చెక్ బుక్‌లు ఎలా తీసుకోవాలో ఎప్పటిలోగా తీసుకోవాలో తెలుసుకోండి.