8.4శాతం తగ్గిన కార్ల అమ్మకాలు..12.5శాతం తగ్గిన ఉత్పత్తి

  • Published By: venkaiahnaidu ,Published On : January 10, 2020 / 10:51 AM IST
8.4శాతం తగ్గిన కార్ల అమ్మకాలు..12.5శాతం తగ్గిన ఉత్పత్తి

గతేడాది డిసెంబర్ లో దేశీయ మార్కెట్లో  మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 8.4శాతం పడిపోయినట్లు శుక్రవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM)తెలిపింది. గత డిసెంబర్ లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(ప్యాసింజర్ కార్లు,యుటిలిటి వెహికల్స్,వ్యాన్స్ తో కలిపి) 2లక్షల 35వేల 786 యూనిట్లతో 1.2శాతం తగ్గిందని ఎస్ఐఏఎమ్ డేటా తెలిపింది. ఇందులో 1లక్షా 42వేల 126 ప్యాసింజర్ కార్లు డిసెంబర్ లో అమ్ముడుపోయానని, అయితే 2018 డిసెంబర్ లో అమ్ముడైన 1లక్షా 55వేల 159 కార్ల కంటే ఇది తక్కువని డేటా తెలిపింది.

దేశీయ ఆటో రంగంలో అన్ని కేటగిరీల్లో అమ్మకాలు 14లక్షల 5వేల 776తో 13.08 శాతం తగ్గినట్లు. డేటా తెలిపింది. వీటిలో ప్రయాణీకులతో పాటు వాణిజ్య వాహనాలు కూడా ఉన్నాయి. అయితే ప్యాసింజర్ వాహనాల్లో…యుటిలిటి వెహికల్స్ అమ్మకాలు మాత్రం 30.02శాతం పెరిగినట్లు తెలిపింది. 2018 డిసెంబర్ లో 65వేల 567 యూనిట్లు అమ్ముడుపోగా 2019 డిసెంబర్ లో 85వేల 252 యుటిలిటి వాహనాలు అమ్ముడుపోయినట్లు తెలిపింది. వ్యాన్ ల అమ్మకాలు మాత్రం 8వేల 408 వాహనాలతో 53.36శాతం పడిపోయాయి.

ఇక ఏటేటా 21వేల 388 యూనిట్లతో వాణిజ్య వాహనాల అమ్మకాలు(మధ్య,భారీ కమర్షియల్ వాహనాలు కలిపి)31.7శాతం పడిపోయాయి. ఇక ద్విచక్ర వాహనాల అమ్మకాలు 10లక్షల 50వేల 38 యూనిట్లతో 16.6శాతానికి పడిపోయాయి. మొత్తంగా దేశీయ మార్కెట్లో(ప్యాసింజర్ వెహికల్స్,కమర్షియల్ వెహికల్స్, టూ-త్రీ వీలర్స్ తో కలిపి) ఉత్పత్తి 18లక్షల 16వేల 112 యూనిట్లతో ఏటేటా 5.2శాతం తగ్గినట్లు SIAM తెలిపింది.