Snapchat Lense Rewards : మీ క్రియేటివిటీనే పెట్టుబడి.. స్నాప్‌చాట్ లెన్స్ క్రియేట్ చేస్తే చాలు.. నెలకు రూ. 6లక్షల వరకు సంపాదించవచ్చు..!

Snapchat Lense Rewards : స్నాప్‌చాట్ మాతృ సంస్థ (Snap Inc) యాప్‌లో ఆకర్షణీయమైన ఫిల్టర్‌లను రూపొందించే క్రియేటర్లను గుర్తించి వారికి రివార్డ్ ఇవ్వడానికి లెన్స్ క్రియేటర్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. క్రియేటివిటీపై నెలకు రూ. 6 లక్షల (7,200 డాలర్ల) వరకు గెలుచుకునే అవకాశం ఉంది.

Snapchat Lense Rewards : మీ క్రియేటివిటీనే పెట్టుబడి.. స్నాప్‌చాట్ లెన్స్ క్రియేట్ చేస్తే చాలు.. నెలకు రూ. 6లక్షల వరకు సంపాదించవచ్చు..!

Earn Rs 6 lakh by creating Snapchat lenses, here is how

Updated On : August 2, 2023 / 9:53 PM IST

Snapchat Lense Rewards : ప్రముఖ సోషల్ యాప్ (Snapchat) పేరంట్ కంపెనీ (Snap Inc) స్పాప్‌చాట్‌లో ఆసక్తికరమైన లెన్స్‌లను రూపొందించే క్రియేటర్లను గుర్తించి వారికి రివార్డ్ అందించడానికి‘Lens Creator Rewards’ అనే కొత్త ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ లెన్స్‌లతో సరదాగా ఫిల్టర్‌లను స్పాప్‌చాట్‌లో క్రియేట్ చేసుకోవచ్చు.

యూజర్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టడానికి తమ స్నేహితులతో సరదాగా గడపడానికి వీలు కల్పించే అత్యంత క్రియేటివ్ లెన్స్‌లను రూపొందించడమే ఈ ప్రొగ్రామ్ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. మీరు ఈ లెన్స్‌లను ఉపయోగించినప్పుడు విభిన్న రూపాలను ప్రయత్నించవచ్చు. ఆసక్తికరమైన వర్చువల్ వ్యూలను అన్వేషించవచ్చు.

స్నాప్‌చాట్ క్రియేటర్లు ఈ లెన్స్‌లను తయారు చేసే మొదటి 5 దేశాలలో భారత్ ఒకటి. ఇక్కడి వారంతా లెన్స్‌లతో ఎంగేజ్ అవ్వడానికి ఇష్టపడతారు. స్నాప్‌చాట్‌‌లో చక్కని అంశాలకు వైవిధ్యాన్ని అందిస్తూ.. భారత వివిధ ప్రదేశాల నుంచి క్రియేటర్ల శక్తివంతమైన కమ్యూనిటీని కలిగి ఉందని సూచిస్తుంది. లెన్స్ క్రియేటర్ రివార్డ్స్ ప్రోగ్రామ్ కింద ఈ క్రియేటర్‌లకు వారి కష్టానికి తగిన గుర్తింపు, డబ్బును పొందడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

Read Also : Twitter X Blue Ticks : ట్విట్టర్ (X) పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. ఇకపై ‘బ్లూ టిక్’ హైడ్ చేసుకోవచ్చు..!

ప్రతి నెల భారత్, యునైటెడ్ స్టేట్స్, మెక్సికోలోని అత్యుత్తమ లెన్స్ క్రియేటర్ వారి అత్యుత్తమ క్రియేషన్‌లకు రివార్డ్‌గా రూ. 6 లక్షల వరకు (సుమారు 7,200 డాలర్లు) పొందవచ్చు. ఈ ప్రొగ్రామ్ భారత్ సహా దాదాపు 40 దేశాల నుంచి స్నాప్‌చాట్ క్రియేటర్లకు అందుబాటులో ఉంది. ఆసక్తిగల వారు ఎవరైనా ఈ ప్రొగ్రామ్‌లో చేరవచ్చు.

ఈ ప్రోగ్రామ్‌లో చేరాలంటే.. క్రియేటర్లు ఉపయోగించడానికి ఇష్టపడే వినూత్న లెన్స్‌లను తయారు చేయాలి. మీరు చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే.. మీరు లెన్స్ క్రియేటర్ రివార్డ్‌ల నిబంధనలలో అర్హత గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలి. స్పాప్‌చాట్ గత కొన్ని ఏళ్లుగా భారత్ నుంచి క్రియేటర్ల పెరుగుదలను చూసింది. ఎక్కువ మంది ఈ కూల్ లెన్స్‌లను తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Earn Rs 6 lakh by creating Snapchat lenses, here is how

Snapchat Lense Rewards : Earn Rs 6 lakh by creating Snapchat lenses, here is how

లెన్స్ క్రియేటర్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ప్రకటించినప్పుడు.. స్నాప్‌చాట్ AR అంబాసిడర్, క్రియేటర్ అయిన ప్రదీపా ఆనంది తన ఉత్సాహాన్ని షేర్ చేశారు. క్రియేటర్లు తమ క్రియేటివిటీకి, పనికి గుర్తింపుతో పాటు రివార్డ్‌లు పొందేందుకు ఈ ప్రొగ్రామ్ ఒక అద్భుతమైన అవకాశమన్నారు. నెలవారీ నగదు బహుమతులు స్పాప్‌చాట్ యూజర్లందరికి ప్రత్యేకమైన, ఉత్తేజకరమైన అనుభవాలను అందిస్తాయని ప్రదీపా అభిప్రాయపడ్డారు.

(Snap Inc.)లో AR డెవలపర్ రిలేషన్స్ గ్లోబల్ హెడ్ జోసెఫ్ డార్కో, (Snapchatters) గ్లోబల్ AR కమ్యూనిటీ రూపొందించిన లెన్స్‌లను ఇష్టపడతాయని, ఇందులో ప్రపంచవ్యాప్తంగా 3లక్షల మంది క్రియేటర్‌లు, డెవలపర్‌లు, టీమ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రియేటర్లు లెన్స్ క్రియేటర్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు వారి విలువైన సహకారానికి రివార్డ్‌లను అందించడానికి స్నాప్ కట్టుబడి ఉందని తెలిపారు.

మీరు స్నాప్‌చాట్‌లో కూల్ లెన్స్‌లను క్రియేట్ చేయాలనుకుంటే.. ఈ ప్రోగ్రామ్ మీ కోసమే.. లెన్స్ క్రియేటర్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో చేరండి. మీ అద్భుతమైన క్రియేషన్‌లకు గుర్తింపుతో పాటు రూ. 6 లక్షలు సంపాదించే అవకాశాన్ని పొందండి. మీ క్రియేటివిటీని పెంచుకుని స్నాప్‌చాటర్‌లకు మరపురాని అనుభూతిని అందించండి.

Read Also : Tech Tips in Telugu : మీ మొబైల్ సిగ్నల్ సరిగా లేదా? ఈ టిప్స్‌తో ఫోన్‌లో ఫుల్ సిగ్నల్ వస్తుంది.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!