Employees need know about EPF: ఈపీఎఫ్ గురించి ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు

జీతాల్లో నుంచి కట్ అయ్యే ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ (ఉద్యోగుల పెన్షన్ స్కీం) గురించి పూర్తిగా అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. ఇలా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల కొంత మంది తమకు హక్కుగా రావాల్సిన సొమ్మును కోల్పోతున్నారు. ఇక కొన్ని సంస్థల్లో ఈ విషయంలో కొన్ని మోసాలు జరుగుతున్నట్లు అక్కడక్కడా వినిపిస్తుంటుంది. ఉద్యోగి జీతంలో నుంచి పీఎఫ్‭ని సంస్థ కట్ చేస్తుంది కానీ వాటిని ఈపీఎఫ్‭కి జమ చేయడం లేదు.

Employees need know about EPF: ఈపీఎఫ్ గురించి ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు

Employees need know about EPF

Employees need know about EPF: జీతాల్లో నుంచి కట్ అయ్యే ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ (ఉద్యోగుల పెన్షన్ స్కీం) గురించి పూర్తిగా అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. ఇలా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల కొంత మంది తమకు హక్కుగా రావాల్సిన సొమ్మును కోల్పోతున్నారు. ఇక కొన్ని సంస్థల్లో ఈ విషయంలో కొన్ని మోసాలు జరుగుతున్నట్లు అక్కడక్కడా వినిపిస్తుంటుంది. ఉద్యోగి జీతంలో నుంచి పీఎఫ్‭ని సంస్థ కట్ చేస్తుంది కానీ వాటిని ఈపీఎఫ్‭కి జమ చేయడం లేదు. ఈ సందర్భాల్లో ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలో తెలీక తాము క్లెయిమ్ చేసుకోవాల్సిన మొత్తాన్ని వదులుకోవాల్సి వస్తోంది. అయితే ఈపీఎఫ్‭ గురించి కొన్ని ప్రాథమిక అంశాల గురించి తెలుసుకుందాం.

ముఖ్యమైన 10 విషయాలు:
1. ఈఫీఎఫ్‭కు జమయ్యే మొత్తంలో ఉద్యోగి వాటాతో పాటు అతడు పని చేసే సంస్థ వాటా కూడా ఉంటుంది.
2. ప్రతి ఉద్యోగి నెల నెలా తన జీతంలో నుంచి 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాకు చెల్లిస్తాడు.
3. మిగిలిన పథకాల కంటే ఈపీఎఫ్‭కు చెల్లించే వడ్డీ ఎక్కువ. అది ప్రస్తుతం 8.10 శాతంగా ఉంది.
4. సంస్థ అందించే కాంట్రిబ్యూషన్‭లో 8.33 శాతం ఈపీఎఫ్‭కి పోగా, మిగిలిన మొత్తం పీఎఫ్ ఖాతాకి చేరుతుంది.
5. జీతం చెల్లించడానికి 15 రోజుల ముందు యజమానులు ఈపీఎఫ్ జమ చెయ్యాలి.
6. చందా తమ ఖాతాలో జమ అయితే రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‭కు ఎస్ఎంఎస్ వస్తుంది.
7. చందా వివరాలు చూసుకోవడానికి EPFO వెబ్‭సైట్‭కి పీఎఫ్ నంబర్‭తో లాగిన్ అవ్వాలి.
8. ఒకవేళ యాజమాన్యం పీఎఫ్ జమ చేయకపోతే ఐపీసీ సెక్షన్ 406/409 కింద పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
9. ఒకవేళ సకాలంలో పీఎఫ్ జమ చేయడంలో విఫలమైతే సదరు సంస్థ ఆదాయపు నన్ను మినహాయింపును క్లెయిమ్ చేయలేదు.
10. కేంద్ర ప్రభుత్వం 2021 నాటి బడ్జెట్‭లో చేసిన ప్రతిపాదనలను తెలుసుకోవాలి.

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ స్క్రీన్‌షాట్స్ తీయడం కష్టం