WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ స్క్రీన్‌షాట్స్ తీయడం కష్టం

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతుంది. ఇకపై యూజర్లు పంపే ‘వ్యూ వన్స్ మెసేజ్’ను ఎవరూ స్క్రీన్‌షాట్ తీయలేరు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ప్రకటించింది.

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ స్క్రీన్‌షాట్స్ తీయడం కష్టం

WhatsApp: వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైంది ‘వ్యూ వన్స్ మెసేజెస్’ను ఇకపై స్క్రీన్ షాట్ తీసే అవకాశం ఉండదు. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉందన్నారు.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

‘వ్యూ వన్స్ మెసేజ్‌’లను సాధారణంగా గోప్యంగా ఉంచాల్సిన సందేశాలు పంపేటప్పుడు వాడుతారు. వాటిని రిసీవ్ చేసుకున్న వారు ఒక్కసారి మాత్రమే ఆ మెసేజెస్ చూడొచ్చు. ఆ తర్వాత అవి డిలీట్ అవుతాయి. అయితే, కొందరు వాటిని స్క్రీన్‌షాట్స్‌గా తీసుకుంటున్నారు. దీనివల్ల వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ అయినప్పటికీ ఇద్దరి మధ్యా జరిగిన చాట్‌.. స్క్రీన్‌షాట్ రూపంలో ఉంటుంది. అందువల్ల ‘వ్యూ వన్స్ మెసేజ్’ ఫీచర్‌కు అర్థం లేకుండా పోతోంది. అందుకే ఇకపై ఈ ఫీచర్ వాడుకుంటే స్క్రీన్‌షాట్ తీయకుండా ఉండేలా అప్‌డేట్ చేస్తున్నారు. దీనితోపాటు త్వరలో మరికొన్ని ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం ఒక గ్రూపులోంచి ఎవరైనా వెళ్లిపోతే దానికి సంబందించి ‘లెఫ్ట్’ అనే సమాచారం అందరికీ కనిపిస్తుంది.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

ఇకపై గ్రూపులోంచి ఎవరైనా ‘లెఫ్ట్’ అయితే, అడ్మిన్‌కు మాత్రమే తెలిసేలా కొత్త ఫీచర్ రాబోతుంది. దీనివల్ల మిగతా సభ్యులకు తెలియకుండానే గ్రూపులోంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు అందరికీ కాకుండా, కావాల్సిన వారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. అవసరం లేని వారికి యూజర్లు తాము ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కనిపించకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.