Google Ex employees : గూగుల్‌లో మానేసి పక్క కంపెనీల్లోకి మాజీ ఉద్యోగులు.. వాళ్లే తిరిగి వస్తారంటున్న సీఈఓ సుందర్ పిచాయ్

Google Ex employees : గూగుల్ మాజీ ఉద్యోగులు ప్రత్యర్థి సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఉద్యోగుల ఆందోళనలపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎట్టకేలకు స్పందించారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పిచాయ్ ఇలా సమాధానం ఇచ్చాడు.

Google Ex employees : గూగుల్‌లో మానేసి పక్క కంపెనీల్లోకి మాజీ ఉద్యోగులు.. వాళ్లే తిరిగి వస్తారంటున్న సీఈఓ సుందర్ పిచాయ్

Ex Google employees joining rival companies and startups, CEO Sundar Pichai

Updated On : June 13, 2023 / 10:40 PM IST

Google Ex employees : గూగుల్ ఇటీవల ఈ ఏడాది ప్రారంభంలో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. నవంబర్ 2022లో ప్రపంచానికి (ChatGPT)ని పరిచయం చేసిన (OpenAI) వంటి పోటీదారు కంపెనీలలో చేరడానికి కొంతమంది గత ఏడాదిలో గూగుల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (CEO Sudar Pichai) ఎట్టకేలకు మాజీ ఉద్యోగుల ఆందోళనలపై స్పందించారు. గూగుల్ మాజీ ఉద్యోగులు పోటీదారు సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు.

బ్లూమ్‌బెర్గ్‌కి ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సుందర్ పిచాయ్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. గతంలో గూగుల్ వదిలేసిన మాజీ ఉద్యోగులు 2,000 స్టార్టప్‌లను క్రియేట్ చేశారని, ఆ విషయంలో వారిని మెచ్చుకునే విషయమని పిచాయ్ అన్నారు. కొంతమంది మాజీ గూగ్లర్లు కంపెనీకి తిరిగి వస్తారని, ఈ స్టార్టప్‌లలో కొన్ని చివరికి తమ క్లౌడ్ కస్టమర్‌లుగా మారతాయని కూడా పిచాయ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇలాంటి పోటీ ఆరోగ్యకరమైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also : Mobile Phones Price Hike : షాకింగ్ న్యూస్.. పెరగనున్న స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి..! 

గూగుల్ మాజీ ఉద్యోగులు 2వేల స్టార్టప్‌లను క్రియేట్ చేశారు. అది చాలా గొప్ప విషయమని తాను భావిస్తున్నానని పిచాయ్ అన్నారు. వారిలో కొందరు గూగుల్ క్లౌడ్ కస్టమర్‌లుగా ఉన్నారు. మరికొంతమంది త్వరలోనే గూగుల్ కంపెనీలోకి తిరిగి వస్తారని పిచాయ్ పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో ఏఐ (AI) టెక్నాలజీ విషయంలో పోటీ మార్కెట్ గురించి సీఈఓ పిచాయ్ మాట్లాడారు.  పోటీ పరంగా గూగుల్ చాట్‌బాట్ బార్డ్ (Google Bard AI) ఎక్కడ ఉందని ఆయన్ను అడగ్గా.. టెక్ కంపెనీ కొన్ని రంగాలలో వెనుకబడి ఉందని అంగీకరించాడు. అయితే, అనేక రంగాల కన్నా గూగుల్ మెరుగ్గా రాణిస్తోంది. ఏఐ విషయానికి వస్తే.. టెక్ దిగ్గజం గూగుల్ మరింత బలమైన స్థానంలో నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

Ex Google employees joining rival companies and startups, CEO Sundar Pichai

Ex Google employees joining rival companies and startups, CEO Sundar Pichai

చాలా కాలంగా AI స్థానికంగా ఉండేలా కంపెనీని నిర్మించామని పిచాయ్ అభిప్రాయపడ్డారు. మనమంతా మొబైల్‌కి మారిన దానికంటే మెరుగైన స్థానంలో ఉన్నామని భావిస్తున్నాని పిచాయ్ చెప్పాడు. ఉద్యోగుల తొలగింపులు అనేది.. గూగుల్ ఖర్చులు తగ్గించుకోవడానికే ఇలా చేసిందా? పిచాయ్‌ను అడిగారు. దానికి గూగుల్‌ను మరింత సమర్ధవంతంగా చేయడమే తన లక్ష్యమన్నారు. గూగుల్ చేయాల్సిన పనిని తాను చేస్తోందని తప్ప మిగతా విషయాలను పిచాయ్ వెల్లడించలేదు. కంపెనీని మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం తాను ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఈ ఏడాది జనవరిలో గూగుల్ 12వేల మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. ఆ సమయంలో సంస్థ ఖర్చులను ఆదా చేయడానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని పిచాయ్ స్పష్టం చేశారు. తొలగించిన ఉద్యోగులకు గూగుల్ సెవెరెన్స్ పే ఆఫర్ చేస్తుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. గూగుల్ కొంతమంది థర్డ్-పార్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తొలగించిందని నివేదిక వెల్లడించగా.. ఆ విషయంలో కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు.

Read Also : Nothing Phone 2 India : నథింగ్ ఫోన్ (2) లాంచ్ డేట్ తెలిసిందోచ్.. డిజైన్, ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?