మడతపెట్టేద్దాం : శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 08:00 AM IST
మడతపెట్టేద్దాం : శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

ఢిల్లీ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్.. మార్కెట్ పోటీని ఎదుర్కొనేందుకు ఫిబ్రవరి 20న మెగా ఈవెంట్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10, గెలాక్సీ ఎస్ 10 ప్లస్ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. అలాగే 5జీ ఫోన్‌ గురించి ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం. శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ 10, 5జీ ఫోన్లతోపాటు ఫోల్డబుల్ (మడతపెట్టే ఫోన్) స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఫిబ్రవరి 20న ఆవిష్కరించనుంది. ఈ విషయాన్ని కంపెనీ ట్విటర్‌లో  తెలియజేసింది. 15 సెకన్ల నిడివితో ఒక టీజర్‌ను విడుదల చేసింది. 

 

శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ పేరుపై చాలా రూమర్లు చక్కర్లు కొడుతున్న క్రమంలో కంపెనీ ఈ లాంచింగ్ తో రూమర్లకు చెక్ పెట్టనుంది. రూమర్స్ లో భాగంగా ఈ ఫోల్డబుల్ ఫోన్ పేరు పై ఎన్నో పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.  గెలాక్సీ ఎక్స్, గెలాక్సీ ఎఫ్, గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ ఫ్లెక్స్ అయ్యి ఉండొచ్చని కష్టమర్స్ అంచనాలు వేస్తున్నారు. అయితే కంపెనీ ఇవి కాకుండా కొత్త పేరును కూడా ప్రకటించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 

 

2019లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్, 5జీ టెక్నాలజీ వంటి అంశాలకు ఎక్కువ ఆదరణ లభించే అవకాశముంది. టెక్నాలజీ రంగంలో నెక్ట్స్ ట్రెండ్ వీటిదే ఉండొచ్చు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు, 5జీ టెక్నాలజీలో శాంసంగ్‌ ముందంజలో ఉన్నా కూడా చైనాకు చెందిన షావోమి, హువావే కంపెనీలను తక్కువ అంచనా వేయలేం. ఇవి శాంసంగ్‌కు సవాలు విసురుతున్నాయి.