ఆపిల్‌కు పోటీగా : రూ.210 కోట్లతో Fitbit కొన్న గూగుల్

  • Published By: sreehari ,Published On : November 2, 2019 / 09:49 AM IST
ఆపిల్‌కు పోటీగా : రూ.210 కోట్లతో Fitbit కొన్న గూగుల్

ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త టెక్నాలజీను కొనుగోలు చేసింది. మేజర్ వేరబుల్ టెక్నాలజీ FitBit ఆపరేటింగ్ సిస్టమ్‌ను 210 కోట్లు (2.1బిలియన్ డాలర్లు)తో సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడూ కొత్త వేరబుల్ డివైజ్ లను ప్రవేశపెట్టే మెన్లో పార్క్ ఆధారిత టెక్ దిగ్గజం WearOSతో గూగుల్ ఈ డీల్ కుదుర్చుకుంది. ఇదివరకే గూగుల్ తమ హార్డ్ వేర్ పొర్ట్ ఫోలియోపై స్మార్ట్ ఫోన్లను ఆఫర్ చేస్తోంది.

అందులో స్మార్ట్ స్పీకర్లు, క్లౌడ్ గేమింగ్ సర్వీసులను అందిస్తోంది. ‘డిఫినెటివ్ అగ్రిమెంట్‌లో భాగంగా వేరబుల్ బ్రాండ్ FiBit టెక్నాలజీలోకి గూగుల్ ఎంట్రీ ఇచ్చినట్టు ప్రకటిస్తున్నాం’ అని గూగుల్ డివైజెస్ అండ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ అస్ట్రోలోహ్ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపారు. ఈ ఒప్పందం కింద ఫిట్ బిట్.. నేరుగా గూగుల్ కలిసి జాయిన్ అవుతోంది. గూగుల్ పేరంట్ కంపెనీ అల్ఫాబెట్ ఇంక్ తమ సొంతం చేసుకున్న తర్వాత స్మార్ట్ హోం సోల్యుషన్స్ కంపెనీ మరో డివిజన్ గా విడిపోయింది. 

కొన్నిఏళ్లు నుంచి గూగుల్ తమ భాగస్వామ్య కంపెనీలతో వేర్ OS, గూగుల్ ఫిట్ తో కలిసి ముందుకు నడుస్తోంది. అప్పటి నుంచి వేరబుల్ డివైజ్ లను రూపొందించి గూగుల్ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఇతర ప్రొడక్టులతో పోలిస్తే ఈ వేరబుల్ డివైజ్ ద్వారా డేటాను పారదర్శకంగా సేకరించవచ్చు.

ఇందులో మరొకరికి వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించలేరు. ఫిట్ బిట్ హెల్త్, వెల్ నెస్ డేటాను మాత్రం గూగుల్ తమ యాడ్స్ కోసం వినియోగించడం లేదని స్పష్టం చేసింది. WearOS ప్లాట్ ఫాం ద్వారా గూగుల్ తమ వేరబుల్ డివైజ్‌లను మార్కెట్ లో ప్రవేశపెట్టినప్పటికీ, భారీ స్థాయిలో ప్రభావం చూపడంలో విఫలమైంది. 

FitBit భాగస్వామ్యంతో ముందుకెళ్లడంతో గూగుల్ వేరబుల్ మార్కెట్ బాటలు పడ్డాయి. గూగుల్ ఫిట్ యాప్స్ తో ఫిట్ నెస్ ట్రాకింగ్ ఈజీగా ఇంటిగ్రేడ్ చేయడంలో సక్సెస్ సాధించింది. తద్వారా ఐఫోన్లతో ఆపిల్ వాచ్ ఫిట్ నెస్ ట్రాకింగ్ సిస్టమ్ తో పోటీ పడేందుకు కంపెనీకి అనుమతి లభించినట్టయింది.