GST కౌన్సిల్ సమావేశం : పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 01:17 PM IST
GST కౌన్సిల్ సమావేశం : పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు

ఏదైనా కొత్త మొబైల్ మార్కెట్‌లోకి రాగానే..దానిని తీసుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇతర కంపెనీ ఫోన్లను బేరీజు వేసుకుంటుంటారు. తమ బడ్జెట్‌లో ఉందా ? లేదా అని ఆలోచించి..ఓ నిర్ణయం తీసుకుంటుంటారు. మొబైల్ ఫోన్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారా ? అయితే మీకొక షాకింగ్ న్యూస్. మొబైల్ ఫోన్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST)ని పెంచుతూ కౌన్సిల్ తీర్మానం చేసింది.

2020, మార్చి 14వ తేదీ శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొబైల్ ఫోన్లపై జీఎస్టీ పెంచడం. 12 శాతం నుంచి ఏకంగా 18 శాతానికి పెంచుతూ…కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2020, మార్చి 14వ తేదీ శనివారం ఉదయం నుంచి షాక్‌ల మీద షాక్‌లిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఫోన్లపై జీఎస్టీ పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీ నెట్ వర్క్‌లోని టెక్నికల్ సమస్యలు, లోపాలపై నందన్ నిలేకని కౌన్సిల్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నిలేకని హామీనిచ్చినట్లు సమాచారం. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 

ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక మందగమనం, కరోనా వైరస్ కారణంగా కొన్ని నిర్ణయాలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఎరువులు, పాదరక్షలపై రేట్లు పెంచే ప్రతిపాదనలు కౌన్సిల్ వాయిదా వేసుకున్నట్లు టాక్. 

Read More : కరోనా భయం : TTD సంచలన నిర్ణయాలు..క్యూ లైన్ లేకుండానే శ్రీవారి దర్శనం..ఆర్జిత సేవలు రద్దు