WhatsApp Web : స్మార్ట్​ఫోన్​+ఇంటర్నెట్ లేకుండా ‘వాట్సాప్​ వెబ్​’ ఉపయోగించడం ఎలా?

వాట్సాప్.. అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూనికేషన్ మెసేంజర్ యాప్ (WhatsApp). ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది తమ మిత్రులు, కుటుంబ సభ్యులతో Whatsappలో కనెక్ట్ అయి ఉంటున్నారు.

WhatsApp Web : స్మార్ట్​ఫోన్​+ఇంటర్నెట్ లేకుండా ‘వాట్సాప్​ వెబ్​’ ఉపయోగించడం ఎలా?

How To Use Whatsapp Web Without Internet On Your Smartphone (2)

Updated On : November 6, 2021 / 11:40 AM IST

WhatsApp Web : వాట్సాప్.. అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూనికేషన్ మెసేంజర్ యాప్ (WhatsApp). ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది తమ మిత్రులు, కుటుంబ సభ్యులతో Whatsappలో కనెక్ట్ అయి ఉంటున్నారు. మల్టీడివైజ్ బీటా ప్రోగ్రామ్ ద్వారా వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వారి స్మార్ట్ ఫోన్ల నుంచి మాత్రమే కాకుండా Web వెర్షన్, డెస్క్‌టాప్ పోర్టల్ నుంచి కూడా WhatsAppని యాక్సెస్ చేసుకోవచ్చు.

ఏకకాలంలో నాలుగు డివైజ్​లలో లాగిన్​ కావచ్చు. Whatsapp Web కనెక్ట్ చేయాలంటే ప్రతిసారి స్మార్ట్ ఫోన్ ద్వారా QR Code స్కానింగ్ చేయాల్సి ఉంటుంది.  అలాగే వాట్సాప్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పటికీ కూడా డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. వాట్సాప్‌లో ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ ఒక స్మార్ట్ ఫోన్‌కు కనీసం నాలుగు డివైజ్ లు లింక్ చేసేందుకు సపోర్ట్ ఇస్తుంది.

అయినప్పటికీ, ఒకవేళ మీ ప్రైమరీ డివైజ్ 14 రోజులకు పైగా డిస్‌కనెక్ట్ అయితే మాత్రం లింక్ అయిన మల్టీ డివైజ్ లన్నీ ఆటోమాటిక్‌గా Logout అయిపోతాయి. WhatsApp పేరంట్ కంపెనీ Meta (Facebook) ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ (end-to-end encryption)కు సపోర్ట్ ఇస్తుందని వెల్లడించింది. అంటే.. మీ వ్యక్తిగత మెసేజ్‌లు, మీడియా కాల్‌లు అన్నీ ప్రైవేట్‌గా ఉంటాయి.
Read Also : WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

స్మార్ట్‌ఫోన్ లేకుండా వాట్సాప్ వెబ్‌ ఉపయోగించాలంటే :
ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్‌ను వెబ్, డెస్క్‌టాప్ లేదా పోర్టల్‌కి లింక్ చేయండి. ఆ తర్వాత మీరు స్మార్ట్‌ఫోన్ లేకుండానే వాట్సాప్ వెబ్ వినియోగించుకోవచ్చు.
మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయాలి.
స్క్రీన్ టాప్ రైట్ కార్నర్ వద్ద ఉన్న మూడు డాట్స్ ఐకాన్‌పై నొక్కండి.
లింక్ అయిన (Linked devices) డివైజ్‌లపై Tap చేయండి.. ఆపై ‘Multi-device beta’పై మళ్లీ Press చేయండి.
అప్పుడు మీకు అక్కడ వాట్సాప్ ఫీచర్‌ను వివరించే పేజీ డిస్‌ప్లే అవుతుంది.
‘Join Beta’ బటన్‌పై నొక్కండి ‘Continue’ బటన్‌ను నొక్కండి.
QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను WhatsApp వెబ్‌కి లింక్ చేయండి.

ఏ పరిస్థితుల్లో ఈ ట్రిక్ పని చేయదంటే :
వాట్సాప్ చాలా పాత వెర్షన్‌ ఉపయోగిస్తున్న డివైజ్‌ల్లో ఈ ఫీచర్ సపోర్ట్ చేయదు. అలాగే ప్రైమరీ iPhone డివైజ్‌లో కూడా పనిచేయదు.
ఇలా లింక్ చేసిన ఇతర డివైజ్‌ల్లో కొన్ని ఫీచర్‌లు పని చేయవు. ఉదాహరణకు ఇలా లింక్ అయిన డివైజ్‌ల్లో live location ఆప్షన్ పనిచేయదు.
WhatsApp వెబ్ నుంచి లింకైన డివైజ్‌ల్లో క్రియేట్ చేయడం/broadcast list వీక్షించడం వంటి మెసేజ్‌లు, లింక్ ప్రివ్యూలకు సపోర్ట్ చేయదు.

Read Also : Offline Whatsapp Trick: ఈ ట్రిక్‌తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్‌ ఆఫ్‌లైన్ చేయొచ్చు..!