Stock Markets: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..!
స్టాక్ మార్కెట్లు మరోసారి డీలా పడ్డాయి. సెన్సెక్స్ 2.87 శాతం.. నిఫ్టీ 3 శాతం పతనమయ్యాయి.

Stock
Stock Markets: స్టాక్ మార్కెట్లు మరోసారి డీలా పడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా 1687.94 పాయింట్లు క్షీణించి.. 57 వేల 107.15 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 526.35 పాయింట్లు పతనమై.. 17 వేల 9.90 పాయింట్ల దగ్గర నిలబడింది. మొత్తంగా చూస్తే.. సెన్సెక్స్ 2.87 శాతం.. నిఫ్టీ 3 శాతం పతనమయ్యాయి. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూడ్డం.. స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ పై ప్రభావితం చూపిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.