ICICI Bank: ఫిబ్రవరి 10 నుంచి క్రెడిట్ కార్డ్ ఛార్జీలను పెంచేస్తున్న ICICI బ్యాంక్

మీరు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీకో బ్యాడ్ న్యూస్! క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ.

ICICI Bank: ఫిబ్రవరి 10 నుంచి క్రెడిట్ కార్డ్ ఛార్జీలను పెంచేస్తున్న ICICI బ్యాంక్

Icici Bank

ICICI Bank: మీరు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీకో బ్యాడ్ న్యూస్! క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. ఐసీఐసీఐ బ్యాంకు తన క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈమేరకు సమాచారం అందించింది.

వివిధ క్రెడిట్ కార్డ్ సేవలపై ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించింది ఐసీఐసీఐ. లేట్ ఫీజుకు కూడా ఇది వర్తిస్తుందని, ఫిబ్రవరి 10వ తేదీ 2022 నుంచి సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ స్ట్రక్చర్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించింది.

ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఎమెరాల్డ్ క్రెడిట్ కార్డు కాకుండా మిగతా అన్ని క్రెడిట్ కార్డులపై లేట్ పేమెంట్ చార్జ్‌లను ఐసీఐసీఐ బ్యాంకు మార్చింది.

మీ అవుట్‌స్టాండింగ్ మొత్తం రూ.100 కంటే తక్కువ ఉంటే, బ్యాంకు ఎలాంటి ఛార్జీలను విధించదు. కానీ అంతకంటే ఎక్కువ ఉంటే, ఛార్జీల బాదుడు గట్టిగానే ఉండబోతున్నాయి. అవుట్‌స్టాండింగ్ మొత్తం రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, బ్యాంకు గరిష్టంగా రూ.1200 వరకు ఛార్జ్ చేయనుంది.

లేట్ పేమెంట్ ఛార్జీలు మాత్రమే కాదు.. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ అడ్వాన్స్ తీసుకుంటే, ట్రాన్సాక్షన్ ఫీజు కింద అడ్వాన్స్ మొత్తంపై 2.50 శాతం ఛార్జీలు వసూలు చేయనుంది బ్యాంకు.

ఐసీఐసీఐ బ్యాంకు సర్వీసు ఛార్జీల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి