అమెరికన్లు వదిలేసిన చికెన్ లెగ్‌లు భారత్‌లో అమ్మేస్తారట

అమెరికన్లు వదిలేసిన చికెన్ లెగ్‌లు భారత్‌లో అమ్మేస్తారట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్బంగా హౌడీ మోడీ సందర్భంగా మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద మిల్క్ ప్రొడక్ట్ చేసే దేశమైన భారత్‌కు అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. దాంతో పాటుగా డైరీ పరిశ్రమలోకి అమెరికాను అనుమతులు ఇచ్చింది.

మన పాల ఉత్పత్తులతో అమెరికా కంపెనీలు వ్యాపారం చేసుకుంటాయి. దీనిపై పరిమిత కాల ఒప్పందానికి భారత్ సమ్మతం తెలపనుంది. ఫలితంగా డైరీ పరిశ్రమపై ఆధారపడి ఉన్న 8కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది. 

అమెరికా నుంచి చికెన్‌ లెగ్స్‌ దిగుమతులను అనుమతించిన భారత్‌.. తాజాగా 5 శాతం టారిఫ్‌, కోటాలతో డైరీ మార్కెట్‌లోకీ అమెరికాను అనుమతిస్తోంది. సాధారణంగా అమెరికన్లు కోడి మాంసంలో లెగ్ పీస్‌లను తినడానికి ఆసక్తి చూపించరు. భారత్‌లో చికెన్‌కు ఉండే డిమాండ్ తెలిసిందే. దీనిని క్యాష్ చేసుకోవాలనుకునే అమెరికా.. భారత్‌కు పంపాలని చూస్తుంది. సాధారణంగా ఫ్రెష్ కోడి మాంసం ఇష్టపడే భారతీయులు తక్కువ ధరకే దొరికే అమెరికా లెగ్ పీస్‌లను ఎంతవరకూ ఇష్టపడతారో మరి. 

భారత్‌-అమెరికా వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఇటువంటి మార్పులను చేసేందుకు సన్నద్ధమైంది మోడీ సర్కార్‌ ప్రచారం. గుండె జబ్బు ఉన్న వారికి ఉపయోగపడే స్టెంట్లు వంటి వైద్య పరికరాల ధరలపై ప్రధాని మోడీ నియంత్రణలు విధించడం, ఈ-కామర్స్‌ నియంత్రణలు వంటి పరిమితులను సడలించేలా కనిపిస్తోంది వాతావరణం. ట్రంప్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో భారత్‌కు పలు రాయితీలు, టారిఫ్‌ తగ్గుదల వంటి ఉపశమన చర్యలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. 

అనూహ్యంగా చైనా వస్తువులను భారత మార్కెట్లో అమ్మకానికి నిషేదం ప్రకటించింది భారత్. కొద్ది రోజుల విరామంతోనే కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలతో చైనాకు లింక్‌లు తగ్గిపోయాయి. ఇప్పుడు భారత్.. అమెరికాతో సంబంధాలు వృద్ధి చేసుకోవాలనుకోవడం భవిష్యత్ కార్యాచరణలో మార్పు కనిపిస్తోంది. చైనా మెడికల్ డివైజ్‌లకు సైతం భారత్‌లో ఎక్కువ టారిఫ్ విధించారని అధికారులు చెబుతున్నారు. దానికి కారణం వారి వద్ద క్వాలిటీ ఉండదని మాత్రమే. 

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్