YouTube CEO: మరో అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా భారత సంతతి వ్యక్తి.. యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్

నీల్ మోహన్ ఇండియన్‌-అమెరికన్‌. సీఈవోగా బాధ్యతలు చేపట్టే వరకు యూట్యూబ్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా పని చేశారు. నీల్‌ మోహన్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2008లో ఆయన గూగుల్‌ సంస్థలో చేరారు. భారతీయులకు టాప్ కంపెనీల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం.

YouTube CEO: మరో అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా భారత సంతతి వ్యక్తి.. యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్

Indian-American Neal Mohan to be new YouTube CEO after Susan Wojcicki steps down

YouTube CEO: భారత సంతతికి చెందిన వారు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన పలు సంస్థలకు అధిపతులుగా రానిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌ గూగుల్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌ పని చేస్తున్నాను. కాగా తాజాగా మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పదవిని పొందారు. ప్రముఖ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్‌ సంస్థ యూట్యూబ్‌కు నీల్‌ మోహన్‌ అనే భారత సంతతి వ్యక్తి సీఈవోగా నియమితులయ్యారు. సంస్థకు అత్యధిక కాలం సీఈవోగా పని చేసిన సూసన్‌ వొజిసికి తాజాగా పదవి నుంచి వైదొగడంతో మోహన్‌ను కొత్త సీఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

IT Raids On BBC: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఎట్టకేలకు ముగిసిన ఐటీ సోదాలు

నీల్ మోహన్ ఇండియన్‌-అమెరికన్‌. సీఈవోగా బాధ్యతలు చేపట్టే వరకు యూట్యూబ్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా పని చేశారు. నీల్‌ మోహన్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2008లో ఆయన గూగుల్‌ సంస్థలో చేరారు. భారతీయులకు టాప్ కంపెనీల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం. యూట్యూబ్ నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న నీల్‌మోహన్‌కు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అభినందనలు తెలిపారు. సుసాన్‌ వొజిసికి సంస్థకు చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన యూట్యూబ్‌ను అత్యంత విజయవంతంగా ముందుకు నడిపించారని ప్రకటనలో పేర్కొన్నారు.

India vs Australia 2nd Test: జోరుమీద టీమ్ఇండియా.. నేటి నుంచి ఇండియా, ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్ ..