Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. క్రేజీ డీల్ ఎప్పటినుంచంటే?

Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days sale)లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ ఎప్పటినుంచంటే?

Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. క్రేజీ డీల్ ఎప్పటినుంచంటే?

iPhone 13 to be available with massive discount during Flipkart Big Saving Days sale, details here

Apple iPhone 13 Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ (Flipkart Big Saving Days sale) త్వరలో ప్రారంభించనుంది. మే 5 నుంచి మే 10 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఆపిల్ ఐఫోన్లతో సహా అనేక ప్రొడక్టులపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) కస్టమర్‌ల కోసం ఒకరోజు ముందుగానే (మే 4న) సేల్ ప్రారంభం కానుంది.

మీరు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌కి విజిట్ చేస్తే.. రాబోయే ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించి ప్రమోషనల్ బ్యానర్‌లు కనిపిస్తాయి. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఇతర గాడ్జెట్‌ల వరకు అద్భుతమైన ఆఫర్‌లను పొందవచ్చు. సేల్ ప్రారంభానికి ముందు.. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్న ఆపిల్ (iPhone 13)పై ‘క్రేజీ’ డీల్ అందిస్తోంది. అలాగే, శాంసంగ్ S21 FE 5G ఫోన్ కూడా అతి తక్కువ ధరకే అందిస్తోంది.

Read Also : Apple iPhones Steal : కస్టమర్ల ఐఫోన్లను కొట్టేసిన డెలివరీ ఏజెంట్.. ఆ 10 ఐఫోన్లను ఎలా మార్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 డీల్ :
ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 (128 GB వేరియంట్) రూ. 61,999 ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ రాబోయే సేల్‌లో భాగంగా iPhone 13పై ‘క్రేజీయెస్ట్ డీల్’ని అందించనున్నట్టు తెలిపింది. కంపెనీ తన వెబ్‌సైట్‌లో డీల్ గురించి వివరాలను వెల్లడించింది. అదే బ్యానర్‌లో, శాంసంగ్ S21 FE 5G ఫోన్ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.54,999కి విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే ఏప్రిల్ 13న ప్రారంభమైన సమ్మర్ సేల్‌లో ఐఫోన్ 13 ఫోన్ రూ. 54,999 ధరకు విక్రయించింది.

iPhone 13 to be available with massive discount during Flipkart Big Saving Days sale, details here

Apple iPhone 13 Sale to be available with massive discount during Flipkart Big Saving Days sale, details here

ఇప్పుడు అదే ఐఫోన్ 13పై ‘క్రేజీయెస్ట్ డీల్’ను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 13 ధర రూ. 50 వేల లోపు ఉండవచ్చు. దీనికి సంబంధించి ధర అధికారికంగా రివీల్ చేయలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి రావొచ్చు. ఈ ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 14 మధ్య ఫీచర్ల పరంగా పెద్దగా తేడా లేదు. అందుకే, ఐఫోన్ 13 తక్కువ ధరకు కొనుగోలు చేయడమే బెటర్..

iPhone 13, iPhone 14 ఏది బెటర్ అంటే? :
ఆపిల్ iPhone 13, iPhone 14 మధ్య పెద్దగా తేడాలు లేవు. రెండు ఫోన్‌లు ఒకే విధమైన రిజల్యూషన్, స్క్రీన్ బ్రైట్‌నెస్, కలర్లతో ఒకే విధమైన డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. రెండు ఫోన్‌ల డిజైన్ సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. రెండు ఫోన్లను పక్కపక్కనే ఉంచినప్పుడు ఒకేలా కనిపిస్తాయి. ఆపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 14 రెండూ 5G కనెక్టివిటీని అందిస్తాయి. A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తాయి. ఆపిల్ iPhone 14లో అదనంగా GPU స్లాట్‌ను అందిస్తోంది. అమెరికా మినహా, ఫిజికల్ సిమ్‌ని ఇన్‌సర్ట్ చేయవచ్చు అలాగే రెండు ఫోన్‌లలో ఇ-సిమ్‌ (e-SIM)ని కూడా ఎంచుకోవచ్చు.

Read Also : iPhone Heating Issues : ఐఫోన్‌లో iOS 16.4.1 అప్‌డేట్ చేశారా? మీ ఫోన్ వెంటనే హీటెక్కుతోందా? ఈ టిప్స్ తప్పక పాటించండి!