జపాన్‌లో గోమూత్రం బంగారం.. కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతోంది!

  • Published By: sreehari ,Published On : March 9, 2020 / 03:10 AM IST
జపాన్‌లో గోమూత్రం బంగారం.. కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతోంది!

ఆ దేశంలో గోమూత్రంతో బంగారం పండిస్తున్నారు. బీడుభూములు కూడా బంగారు పంటలుగా మారిపోతున్నాయి. భూసారం క్షీణించి పంటల దిగుబడి తగ్గిపోతున్న పరిస్థితుల్లో గోమూత్రంతో తయారుచేసిన సేంద్రీయ ఎరువులు భూమి సారవంతం కోల్పోకుండా రక్షిస్తున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి. నార్తరన్ జపాన్ ఆధారిత సేంద్రీయ ఉత్పత్తుల కంపెనీ Kankyo Daizen ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. పర్యావరణానికి అనుకూలమైన ఎరువులను తయారు చేసి పొలాలకు సేంద్రీయ ఎరువులుగా అందిస్తున్నారు.

సౌత్ ఈస్ట్ ఏసియాలోని రైతులు దగ్గర గోవుల నుంచి మూత్రాన్ని ఈ కంపెనీ సేకరిస్తోంది. Tsuchi Ikikaeru అనే సేంద్రీయ ఎరువు పేరుతో లిక్విడ్ రూపంలో అందిస్తోంది. సారవంతం కోల్పోయిన భూముల్లో తిరిగి జీవాన్ని నింపేందుకు ఈ గోమూత్రం ఎరువు అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు… జపాన్ దేశానికి మాత్రమే పరిమితం కాకుండా మరో ఐదు దేశాల్లో వియత్నాం, కంబోడియాలకు కూడా ఈ సేంద్రీయ ఎరువును సరఫరా చేస్తోంది కంపెనీ. వ్యవసాయానికి అనుకూలమైన సౌత్ ఈస్ట్ ఏసియాలో ఎరువుల సాంధ్రత భూసారం వంటి క్షీణత సమస్యలను ఎదుర్కొంటోంది.

వ్యవసాయ రసాయనాలను దీర్ఘకాలంగా వాడటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. Kankyo Daizen సేంద్రీయ ఎరువుల కంపెనీ ఈ సమస్యపైనే దృష్టి సారించింది. జపాన్ ప్రధాన భూభాగంలోని ఉత్తర ప్రాంతమైన హుక్కాయిడోలోని రైతుల డెయిరీ నుంచి గోవుల మూత్రాన్ని కంపెనీ సేకరిస్తోంది. 2002లో అదే ప్రాంతంలో అక్కడే కంపెనీ ప్లాంట్ స్థాపించింది. అప్పటినుంచి Tsuchi Ikikaeru అనే పేరుతో సేంద్రీయ ఎరువు ద్రవణాన్ని తయారు చేసి రెండు జపాన్ ట్రేడింగ్ సంస్థలైన అగ్రికల్చరల్ ప్రొడ్యుసర్లతో విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ ప్రకృతిసిద్ధమైన సేంద్రీయ ఎరువు సాయిల్ కండీషనర్‌గా విదేశీ కస్టమర్ల ప్రశంసలను అందుకోంటోంది. Kankyo Daizen కంపెనీ ఉత్పత్తి చేసే సేంద్రీయ ఎరువులు, డియోడరైజెస్ లకు విదేశీ మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.

జనవరి నాటికి 12 నెలల కాలంలో ఈ కంపెనీ సేల్స్ 11 శాతంగా పెరిగి 230 మిలియన్ల yen (2.13 మిలియన్ల డాలర్లు) ఆదాయాన్ని ఆర్జిస్తోంది. విదేశీ ఎగుమతులతో ఈ కంపెనీ ఆదాయం మొత్తంగా 10 శాతానికి పెరిగింది. ఈ సేంద్రీయ ఎరువులను పొలాల్లో ఎరువులుగా జల్లితే మంచి దిగుబడిని సాధిస్తాయిని గట్టిగా చెబుతోంది. ఈ ఉత్పత్తులను నీటిలో కలిపి పంటలకు ఎరువుగా అందిస్తే బాగా పండుతాయని అంటోంది. వరి, కూరగాయలు, పూల పంటలు, రొయ్యల పెంపక వంటి పంటలకు నాణ్యమైన దిగుబడిని అందిస్తుందని పేర్కొంది. అంతేకాదు.. భూసారం కూడా బాగా పెరుగుతుందని.. పంట వేసిన పొలాల్లో మరుసటి ఏడాది అదే పంట వేసినా దిగుబడి బాగా వస్తుందని కంపెనీ చెబుతోంది.

See Also | ట్యాప్ తిప్పితే..రెడ్ వైన్ వచ్చింది