Jio 5G, JioPhone 5G : జియో 5G సేవలతో పాటు జియో ఫోన్ 5G వస్తోంది.. ఆగస్టు 29 లాంచ్ అయ్యే ఛాన్స్..!

Jio 5G, JioPhone 5G : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఈ నెలాఖరులో వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022 ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఆగస్ట్ 29న ఈ సమావేశం జరుగనుంది.

Jio 5G, JioPhone 5G : జియో 5G సేవలతో పాటు జియో ఫోన్ 5G వస్తోంది.. ఆగస్టు 29 లాంచ్ అయ్యే ఛాన్స్..!

Jio 5G, JioPhone 5G Launch Jio 5G, JioPhone 5G expected to launch on August 29

Jio 5G, JioPhone 5G : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఈ నెలాఖరులో వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022 ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఆగస్ట్ 29న ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కంపెనీ AGM గురించి ఏమీ వెల్లడించలేదు. ఎలాంటి ప్రొడక్టులను ప్రకటిస్తారనేది రివీల్ చేయలేదు. 5Gకి సంబంధించిన ప్రకటన కచ్చితంగా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖేష్ అంబానీ జియో 5G సేవలను ప్రకటిస్తారని, జియో యూజర్లకు ఎలా, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది వెల్లడించనున్నారు. రిలయన్స్ కంపెనీ 5G ప్లాన్‌లను (2016 ఏడాదిలో) 4G సేవలను ప్రకటించిన సమయంలో అనేక ఆఫర్లను ప్రకటించిన మాదిరిగానే ప్రకటించవచ్చు. రిలయన్స్ జియో కొంతకాలంగా 5G సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది.

దేశంలో అతి త్వరలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి దశలో టెలికాం ఆపరేటర్ ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, అహ్మదాబాద్, గురుగ్రామ్, ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నోతో సహా 13 నగరాల్లో 5G సర్వీసులను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదనంగా, టెలికాం ఆపరేటర్ Jio 5G ఫోన్ లేదా JioPhone 5Gని కూడా లాంచ్ చేయనున్నట్టు భావిస్తున్నారు. గూగుల్ సహకారంతో ఈ సరసమైన 5G ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. లాంచ్‌కు ముందు, JioPhone 5G గురించి ఫీచర్లు, స్పెషిఫికేషన్ల వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.

Jio 5G, JioPhone 5G Launch Jio 5G, JioPhone 5G expected to launch on August 29

Jio 5G, JioPhone 5G Launch Jio 5G, JioPhone 5G expected to launch on August 29

JioPhone 5G ఫోన్ 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌ను HD+ క్వాలిటీతో ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌తో రానుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 4GB RAM, 32GB స్టోరేజీకి సపోర్టుతో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 5G ప్రాసెసర్ అందుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ ముందు ఈ ఫోన్ PragatiOSలో రన్ అవుతుంది. కొన్ని Jio యాప్‌లతో పాటు Google Play సర్వీసులతో కూడి ఉంటుంది. కనీసం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీతో బ్యాకప్ రానుందని నివేదిక తెలిపింది. USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌కు సపోర్ట్ చేయనుంది.

JioPhone 5G 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-MP మాక్రో కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను అందించనుంది. కొన్ని ఇతర ఫీచర్లు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Google అసిస్టెంట్‌‌తో రానుంది. Google Lens, Google ట్రాన్స్‌లేషన్ ద్వారా ఇన్‌స్టంట్ ట్రాన్సలేషన్‌తో రానుంది. ధరల విషయానికి వస్తే.. JioPhone 5G ధర రూ. 10వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Jio 5G Phone Launch : రిలయన్స్ జియో 5G ఫోన్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?