Jio AI Cloud Infrastructure : భారత్‌కు అత్యాధునిక AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌.. NVIDIAతో జియో భాగస్వామ్యంపై అంబానీ ఏమన్నారంటే?

Jio AI Cloud Infrastructure : జియో ప్లాట్ ఫారమ్స్ కొత్త NVIDIA సహకారంతో భారత్ AI అభివృద్ధి ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది. భారతీయ పోటీతత్వానికి, సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రముఖ AI సామర్థ్యాలను దేశానికి తీసుకువస్తోంది.

Jio AI Cloud Infrastructure : భారత్‌కు అత్యాధునిక AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌.. NVIDIAతో జియో భాగస్వామ్యంపై అంబానీ ఏమన్నారంటే?

Jio Platforms Teams with NVIDIA to Bring State-of-the-Art AI Cloud Infrastructure to India

Jio AI Cloud Infrastructure : ప్రముఖ దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫారమ్స్‌ (Jio Platforms) లిమిటెడ్ భారత్‌కు అత్యాధునిక ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఎన్విడియా(NVIDIA) కంపెనీతో జియో ప్లాట్ ఫారమ్స్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI), (GPU) అత్యాధునిక క్లౌడ్-ఆధారిత AI కంప్యూట్ మౌలిక సదుపాయాలను నిర్మించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో భారత్‌లో కొత్త AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నిర్మించనున్నాయి.

ఈ కొత్త AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (NVIDIA – GPU) టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. తద్వారా అత్యంత శక్తివంతమైన AI ప్లాట్‌ఫారమ్‌గా అవతరించనుంది. ఈ కంపెనీల సహకారంతో కృత్రిమ మేధస్సులో వృద్ధి చెందుతున్న శక్తిగా భారత్ స్థానాన్ని వేగవంతం చేయనుంది. ఈ కొత్త AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ భారత్ అంతటా పరిశోధకులు, డెవలపర్‌లు, స్టార్టప్‌లు, శాస్త్రవేత్తలు, AI అభ్యాసకులకు అందుబాటులోకి రానుంది. వేగవంతమైన కంప్యూటింగ్, హై-స్పీడ్, సురక్షితమైన క్లౌడ్ నెట్‌వర్కింగ్‌ను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ కొత్త AI చాట్‌బాట్‌లు, డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ రీసెర్చ్, మరిన్నింటితో సహా భారత్ AI ప్రాజెక్ట్‌లను వేగవంతం చేస్తుంది.

Read Also : Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఈ తేదీ నుంచే ప్రీ-ఆర్డర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఏఐలో భారత్‌ను అగ్రగామిగా మారుస్తాం : ముఖేశ్ అంబానీ
కంపెనీల సహకారంలో భాగంగా NVIDIA జియోకు CPU, GPU, నెట్‌వర్కింగ్, AI ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అత్యంత అధునాతన AI మోడల్‌లను రూపొందించడానికి ఫ్రేమ్‌వర్క్‌లతో సహా ఎండ్-టు-ఎండ్ AI సూపర్ కంప్యూటర్ టెక్నాలజీలను అందిస్తుంది. జియో AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్వహిస్తుంది. కస్టమర్ ఎంగేజ్‌మెంట్, యాక్సెస్‌ను పర్యవేక్షిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘భారత్ డేటా విస్తరణలో వేగవంతమైన వృద్ధికి సాంకేతిక మౌలిక సదుపాయాలను సృష్టించడం, కంప్యూటింగ్, టెక్నాలజీ సూపర్ సెంటర్‌లను సృష్టించడంతో ముందుకు సాగుతుంది.

Jio Platforms Teams with NVIDIA to Bring State-of-the-Art AI Cloud Infrastructure to India

Jio Platforms Teams with NVIDIA to Bring State-of-the-Art AI Cloud Infrastructure to India

స్ట్రాంగ్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కూడిన దేశంగా భారత్ అవతరించనుంది. NVIDIAతో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం కంప్యూటింగ్, టెక్నాలజీ సూపర్ సెంటర్లను నిర్మించడంలో సాయపడతుంది. భారత డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయడంలో జియో మాదిరిగా కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ అగ్రగామిగా మారేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నాను’ అని అంబానీ పేర్కొన్నారు.

భారత్‌లో అందరికి ఏఐని అందుబాటులోకి తెస్తాం : ఆకాష్ అంబానీ
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ’భారత్‌లో ప్రతి ఒక్కరికీ అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడమే జియో లక్ష్యం. NVIDIAతో భాగస్వామ్యమే ఇందుకు నిదర్శనం. ఈ కంపెనీతో కలిసి భారత్‌లో AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మిస్తాం. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రైజ్ వంటి రంగాలలో AI టెక్నాలజీని వేగవంతం చేయనున్నాం. ఏఐని భారత్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో తీసుకురానున్నాం. ఏఐలో భారత్ అగ్ర దేశంగా మారడంలో సాయపడుతుంది’ అని ఆకాష్ అంబానీ తెలిపారు.

భారత్‌లో అత్యాధునిక ఏఐ సూపర్‌ కంప్యూటర్‌లను నిర్మించేందుకు రిలయన్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని NVIDIA వ్యవస్థాపకుడు, CEO జెన్సన్ హువాంగ్ అన్నారు. భారత్‌లో స్కేల్, డేటా, టాలెంట్ ఉన్నాయి. అత్యంత అధునాతన AI కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో, రిలయన్స్ భారత్‌లో అందరి కోసం AI అప్లికేషన్‌లతో సొంత భాషా నమూనాలను రూపొందించగలదని హువాంగ్ అభిప్రాయపడ్డారు.

Read Also : Tech Tips in Telugu : ఆటో పేమెంట్ చేస్తున్నారా? గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేలో ఆటో పే ఫీచర్ ఎనేబుల్ ఎలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!