జియో వినియోగదారులకు మరో బిగ్ షాక్

ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 03:28 AM IST
జియో వినియోగదారులకు మరో బిగ్ షాక్

ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు

ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు వైర్ లెస్ డేటా ఛార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది. వైర్ లెస్ డేటా టారిఫ్‌లను పెంచాలని జియో నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 15గా ఉన్న 1 జీబీ డేటా ధరను రూ. 20కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్‌కు జియో లేఖ రాసింది. ప్రతిపాదిత డేటా ధరలను తక్షణమే కాకుండా 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో అమలు చేయాలని భావిస్తున్నట్టు ట్రాయ్‌కు తెలిపింది. పెరగనున్న డేటా చార్జీలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయంది. వాయిస్ కాల్స్ ధరల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న వాటినే యథావిధిగా కొనసాగించనున్నట్టు జియో వెల్లడించింది. వినియోగదారుల్లో పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా ఫ్లోర్ ప్రైసింగ్ ను పెంచాలని ట్రాయ్ కి రాసిన లేఖలో జియో అడిగింది. 

డేటా చార్జీల బాదుడు:
టెలికం సేవల్లోని టారిఫ్ సమస్యలపై స్పందించాల్సిందిగా ట్రాయ్ కోరిన నేపథ్యంలో జియో కన్సల్టేషన్.. ఓ నివేదికను సమర్పించింది. భారతీయ వినియోగదారులు సాధారణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు పొందాలనుకుంటారని, కాబట్టి పెరిగిన చార్జీలను రెండు మూడు విడతల్లో అమలు చేసే వెసులుబాటు కల్పించాలని ట్రాయ్‌ను కోరింది. ఒకసారి డేటా చార్జీలను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అన్ని టారిఫ్‌లు, సెగ్మెంట్లలో అమలు చేస్తామని జియో తెలిపింది. టెలికాం రంగం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా ఫ్లోర్ ప్రైసింగ్ ను నిర్ణయించాలని ట్రాయ్ ఎప్పట్నుంచో సూచిస్తుంది. ఎయిర్ టెల్, వొడాఫోన్ సంస్థలు ఇప్పటికే భారీ ఏజీఆర్ బకాయిలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 1 జీబీ కనీస ధరను మెల్లగా రూ.15కు అక్కడ నుంచి రూ.20కు తీసుకెళ్లాలని రిలయన్స్ జియో ట్రాయ్ కు లేఖ రాసింది.

ఫ్రీ పోయింది.. బాదుడు షురూ అయ్యింది:
టెలికం రంగంలోకి అడుగుపెట్టిన స్వల్ప కాలంలోనే ఉచిత వాయిస్ కాల్స్‌తో సంచలనం సృష్టించింది రిలయన్స్ జియో. అనతి కాలంలోనే నెంబర్ 1 స్థాయికి చేరింది. కోట్ల మంది కస్టమర్లతో మార్కెట్ లో మెజార్టీ వాటా కైవసం చేసుకుంది. 2019 చివర్లో ఉచితాన్ని ఎత్తివేసి కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది జియో. ఇతర నెట్ వర్క్స్ కు చేసే ఔట్ గోయింగ్ కాల్స్ కు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. అలాగే టారిఫ్ లను భారీ స్థాయిలో పెంచింది. డేటా ప్యాక్స్ తో పాటు వాయిల్ కాల్స్ కు కూడా సెపరేట్ టారిఫ్ లను ప్రకటించి కస్టమర్ల నడ్డి విరిచింది. ఇప్పుడు అంతకుమించిన షాకిచ్చేందుకు సిద్ధమైంది. 

టెల్కో దిగ్గజాలు భారీగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున టెలికాం పరిశ్రమ భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.35వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. రిలయన్స్ జియో ఒక టార్గెట్ ఫ్లోర్ ధరను నిర్ణయించిన తర్వాత, ఇది టెలికాం పరిశ్రమలో కీలకమైన అంశంగా ఉండి, దెబ్బ తిన్న కంపెనీలకు సాయం చేస్తుందని జియో పేర్కొంది. అలాగే స్థిరమైన ఫ్లోర్ ప్రైస్ టెల్కో దిగ్గజాల ఆర్థిక భారాన్ని నెమ్మదిగా తొలగిస్తుందని తెలిపింది.

See Also | BS-6 వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఉండాల్సిందే..లేకపోతే బండిస్టార్ట్ కాదు