Komaki Ranger: భారత్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్.. నేడే విడుదల!

భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ నేడు విడుదల కానుంది.

Komaki Ranger: భారత్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్.. నేడే విడుదల!

Bike

Komaki Ranger: భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ నేడు విడుదల కానుంది. దీని పేరు కోమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్(Komaki Ranger electric cruiser). భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌గా కంపెనీ దీనిని ప్రదర్శిస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌ను ఇటీవలే ఆవిష్కరించారు. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో మోటార్‌సైకిల్ రూపాన్ని, డిజైన్‌ని స్పష్టంగా చూపిస్తుంది. ఫస్ట్ లుక్‌లో ఈ మోటార్‌సైకిల్ బజాజ్ అవెంజర్‌లాగా అనిపిస్తుంది.

కోమాకి రేంజర్ ప్రత్యేకత ఏమిటి?
కొమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ 5వేల వాట్ల మోటారును పొందవచ్చని భావిస్తున్నారు. ఇది చాలా శక్తివంతమైన మోటారుగా ఉండబోతోంది. కష్టతరమైన రోడ్లపై కూడా మంచి డ్రైవింగ్ పనితీరు కనబరుస్తుంది. ఈ శక్తివంతమైన మోటారుకు Komaki రేంజర్ 4 kW బ్యాటరీ ప్యాక్‌ని అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రిక్ క్రూయిజర్‌లో క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, బ్లూటూత్, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

మోటార్‌సైకిల్‌లో షైనింగ్ క్రోమ్ ఎలిమెంట్స్ ఇవ్వగా.. దీనితో పాటు, రౌండ్ LED ల్యాంప్స్ మరియు రెట్రో థీమ్ సింగిల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. Komaki రేంజర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కి.మీలు రైడింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌గానే కాదు.. కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌గా కూడా దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్‌లో, ఈ విభాగంలో ప్రస్తుతం ఏ ద్విచక్ర వాహనం లేదు. ఏ ఇతర కంపెనీ ఈ విభాగంలోకి ప్రవేశించకముందే దాని మార్కెట్‌ను పట్టుకోగలిగేలా కంపెనీ సరసమైన ధరకు దీనిని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే దీని ధర గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.