Electric Bike: రూ. 50వేల లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ 100కిలోమీటర్లు నడుస్తుంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

Electric Bike: రూ. 50వేల లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ 100కిలోమీటర్లు నడుస్తుంది

Komaki

Komaki X1 electric scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు EVల వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా మంచి బ్యాటరీ రేంజ్‌తో.. తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ టూ వీలర్‌లను కొనాలని ఆలోచిస్తుంటే మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సరిగ్గా సరిపోతుంది. దీని ధర 50 వేల రూపాయలలోపే ఉంటుంది.

భారతదేశంలో ఉన్న అనేక స్టార్టప్ కంపెనీలు మంచి బ్యాటరీ రేంజ్‌తో సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్నాయి. ఇందులో కోమకి XGT KM మొదటి స్థానంలో ఉంది. కోమాకి ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం 42,500 రూపాయలు మాత్రమే. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ బండిపై వెళ్లవచ్చు. ఇది కాకుండా, కబీరా మొబిలిటీ కొల్లెజియో ధర రూ. 45,990, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వరకు వెళ్లవచ్చు. అదే సమయంలో, రఫ్తార్ ఎలక్ట్రిక్ ధర రూ.48,540 ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100కిమీ వరకు డ్రైవింగ్ చేయవచ్చు.

కోమకి భారతదేశంలో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తుంది, వీటిలో Komaki Xone ధర రూ .45,000, Komaki X2 Vouge రూ .47,000. దీనితో పాటు, వెలేవ్ మోటార్స్ VEV 01 ధర కేవలం రూ. 32,500 నుంచే ప్రారంభమవుతుంది. ఆంపియర్ మాగ్నస్ ప్రో ధర రూ .49వేల 999 వద్ద ప్రారంభం అవుతుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర తక్కువగా ఉన్నప్పటికీ, సింగిల్ ఛార్జ్‌లో అవి లభించే రేంజ్‌తో ఖచ్చితంగా మంచి అనుభం వస్తుంది. అయితే, మీరు అత్యధిక వేగంతో రాజీపడవలసి ఉంటుంది. వేగం విషయంలో మాత్రం రాజీపడక తప్పదు. మీరు భారత మార్కెట్లో స్పీడ్‌గా వెళ్లే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చూస్తున్నట్లయితే కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ, లభిస్తాయి.