Acer Muvi 125 4G Launch : ల్యాప్‌టాప్ కంపెనీ ఏసర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 80కి.మీ దూసుకెళ్తుంది!

Acer Muvi 125 4G Launch : పాపులర్ తైవాన్ టెక్ దిగ్గజం (Acer) భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి వ్యూహాత్మకంగా అడుగుపెట్టింది. ఏసర్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Acer Muvi 125 4G)ని లాంచ్ చేసింది.

Acer Muvi 125 4G Launch : ల్యాప్‌టాప్ కంపెనీ ఏసర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 80కి.మీ దూసుకెళ్తుంది!

Laptop manufacturer Acer Muvi 125 4G launched new electric scooter

Updated On : October 18, 2023 / 4:37 PM IST

Acer Muvi 125 4G Launch : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అడుగుపెట్టింది. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ హార్డ్‌వేర్‌లకు ప్రసిద్ధి చెందిన తైవాన్ టెక్ దిగ్గజం ఏసర్ (Acer) ఈ కొత్త వెంచర్ ఈవీ స్కూటర్ తీసుకొచ్చింది. భారతీయ అర్బన్ మొబిలిటీ స్టార్టప్ అయిన (Think eBikeGo Pvt Ltd) సహకారంతో ఈవీ మార్కెట్లోకి (Acer Muvi 125 4G) ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 80కి.మీ పరిధిని అందిస్తుంది. అంతేకాదు.. గరిష్టంగా 75kmph వేగంతో దూసుకెళ్లగలదు.

Read Also :  TVS iQube EV Scooter : ఓలా, బజాజ్, ఏథర్‌కు పోటీగా.. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..!

కస్టమ్ బిల్డ్ ఆప్షన్ కూడా :
ఆఫీసులకు వెళ్లేవారు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల నుంచి రోజువారీ ప్రయాణికుల వరకు వైడ్ రేంజ్ వినియోగదారుల కోసం ఈవీ స్కూటర్‌ను కంపెనీ రూపొందించింది. హైపర్-లోకల్ ఫుడ్ డెలివరీ లేదా కిరాణా డెలివరీ వంటి B2B వినియోగదారులకు కస్టమ్-బిల్ట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో స్కూటర్‌లో తేలికపాటి ఫ్రేమ్, వివిధ భూభాగాల్లో దూసుకుపోయేలా 16-అంగుళాల చక్రాలు ఉన్నాయి. నిరంతర రైడ్‌లు, అవాంతరాలు లేని ఛార్జింగ్‌ కోసం రిప్లేసబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా అందిస్తోంది.

Laptop manufacturer Acer Muvi 125 4G launched new electric scooter

Laptop Acer Muvi 125 4G launch

త్రీ వీలర్ ప్రొడక్టులపై ఏసర్ ఫోకస్ :
సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ అనే రెండు ముఖ్యమైన సూత్రాలు ఏసర్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందాయి. ఏసర్ (Acer Muvi 125 4G) ఈవీ స్కూటర్ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహిస్తూ కేంద్ర, రాష్ట్ర-స్థాయి ప్రభుత్వ రాయితీలు రెండింటికీ అర్హత కలిగి ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ఏసర్ ఫస్ట్ ఎంట్రీతోనే ఆకట్టుకుంటోంది. అయితే, భవిష్యత్తులో మల్టీ ఎలక్ట్రిక్ టూ- త్రీ-వీలర్ ప్రొడక్టులను కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

ఏసర్ MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ-బుకింగ్‌లు త్వరలో అందుబాటులో ఉంటాయి. ప్రీ-బుకింగ్‌లు, డీలర్‌షిప్ ఎంక్వైరీల కోసం దయచేసి అధికారిక వెబ్‌సైట్‌ను (acerelectric.in) విజిట్ చేయండి. అన్ని ఆర్డర్‌లు అధీకృత డీలర్‌ల ద్వారా ప్రత్యేకంగా డెలివరీ చేయనుంది. కస్టమర్‌లు టాప్ రేంజ్ సర్వీసులు, నిర్వహణ, వారంటీ & సపోర్టును పొందవచ్చు. ఆకర్షణీయమైన డీలర్ వేతన నిర్మాణం, భారతీయ ప్రధాన నగరాల్లో స్కూటర్ల పంపిణీకి డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనుంది.

Read Also : OnePlus Open Launch : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?